Akkala Karra : నత్తి పోగెట్టే మొక్క ఇదే.. పేరులో కర్ర ఉన్న ఖరీదైన ప్రయోజనాలు..!

Akkala Karra : ప్రకృతి ఔషధాల నిలయం. ప్రతి సమస్యకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది.. ప్రకృతి లో ఉండే మొక్కలు మనకు ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుంటే వాటి ప్రయోజనాలు చాలా తేలిక.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన వాటిలో అక్కలకర్ర ఒకటి.. ఈ మూలిక వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు..!

అక్కలకర్ర చూర్ణాన్ని అరచెంచా చొప్పున కొద్దిగా తేనె కలిపి రెండుపూటలా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అక్కలకర్ర మూలిక పొడిని మిరియాలతో తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. అక్కలకర్ర కషాయాన్ని ఒక స్కూల్ తాగితే జలుబు దగ్గు పడిశం గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.అక్కల కర్ర పొడికి సమాన మోతాదులో చందనం కలిపి అందులో నెయ్యి, పంచదార కలిపి తీసుకుంటే రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి.

This is snail pogette Akkala Karra plant
This is snail pogette Akkala Karra plant

అక్కల కర్ర ను అరగదీసి పుండ్లు, వాపులు, బొబ్బలు ఉన్నచోట ఆ మిశ్రమాన్ని లేపనంగా రాస్తే అవి త్వరగా మానిపోతాయి. వేడి బొబ్బులు త్వరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా అక్కల కర్ర ను అరగదీసి నాలిక పైన రాస్తూ ఉంటే నత్తి తగ్గుతుంది. మాటలు రాక పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారికి ఈ మూలిక అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ చూర్ణాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే నోట్లో పుండ్లు పడతాయి.