Skin Problems : అన్ని రకాల చర్మ సమస్యలకు ఈ ఆకు సంజీవని..!

Skin Problems : ప్రకృతి లోని మరో అద్భుతమైన మూలిక గాడిద గడిపాకు.. ఈ మూలికలు బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది..! గాడిద గడిపాకు మూలిక అద్భుతమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!గాడిద గడిపాకు చక్కటి క్రిమి సంహారిణి. చర్మ రోగాల కి చాలా చక్కగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురద, సెగ గడ్డలు, పొక్కులు ఉన్నప్పుడు

ఈ ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని ఆ చర్మ సమస్యలు ఉన్నచోట రాస్తే సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. చంటి పిల్లలు కడుపులో నులిపురుగుల సమస్య తో బాధపడుతున్న వారికి ఈ ఆకు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. గాడిద గడిపాకు ఆకులను 50 గ్రాములు తీసుకుని అందులో 25 గ్రాములు పాత బెల్లం కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న బఠాణీ గింజ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత వీటిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక మాత్ర ను నీటితో కలిపి తీసుకుంటే కడుపులోని నులి పురుగులు చనిపోతాయి

For all skin problems tips Gaadidha Gadapa use
For all skin problems tips Gaadidha Gadapa use

శరీరంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియా మొత్తం నశింపజేస్తుంది.గాడిద గడిపాకు రసం సోరియాసిస్ కు చెక్ పెడుతుంది. ఈ ఆకుల రసం సోరియాసిస్ సమస్య ఉన్న చోట ఉదయం, సాయంత్రం రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసం పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. పుండ్లు లో ఉండే బ్యాక్టీరియా ను నశింపచేసే శక్తి ఈ ఆకులకు ఉంది. వాటిలో ఉండే వైరస్ ను హతం చేస్తుంది.