LIC Policy : ఎల్ఐసి పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటో తెలుసా..?

LIC Policy : దేశంలో ఉన్న భారత పౌరుడు ప్రతి ఒక్కరు జీవిత బీమా పాలసీ తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పౌరులకు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే జీవిత బీమా పాలసీలు గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలలో ఒక భాగంగా మారిపోయాయి. చాలామంది కుటుంబ భవిష్యత్తు భద్రత కోసం తరతరాలుగా జీవిత భీమా పాలసీలను మార్గదర్శకంగా ఎంచుకోవడం జరిగింది. అయితే.. జీవిత బీమా పాలసీ తీసుకున్న వారికి అవగాహన చాలా తక్కువగా ఉందని ఇటీవల జరిగిన ఒక సర్వేలో వెల్లడైంది. 2020 కరోనా మహమ్మారి తో ఇన్సూరెన్స్ రంగం పూర్తిగా మారిపోయింది.ఇక దీంతో చాలామంది ఎల్ఐసీలో చేరి భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థికంగా నష్టం చేకూర్చకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నిజానికి చాలా మంది ఖర్చు తగ్గించుకున్న అప్పటికీ సంక్షోభం మధ్య కుటుంబ ఆర్థిక భవిష్యత్తు కోసం ఆదా చేయడం అనేది కీలకమైన అంశంగా మారిపోయింది. అందుకే ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ అంటే జీవిత బీమా కవరేజి కలిగి ఉండడం. అలాంటప్పుడు జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య అంశాలు కూడా ఉన్నాయి.అవేమిటంటే కంపెనీ సర్వీస్ క్వాలిటీ ని చెక్ చేయాలి. సర్వీస్ క్వాలిటీ అనేది వినియోగదారులకు సరైన విధానాన్ని అందించడం, వినియోగదారులకు సహాయం చేయడానికి సాధ్యమైనంతవరకు సమాచారాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఇక తర్వాత బీమా కంపెనీ సాంకేతికతను స్వీకరించిందా లేదా అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.

Do you know what you need to know before taking an LIC policy
Do you know what you need to know before taking an LIC policy

గతంలో అయితే ఎల్ఐసి పాలసీ తీసుకునేటప్పుడు ఏజెంట్లు ముఖాముఖి కూర్చొని వినియోగదారులకు పాలసీ గురించి వివరించడం జరిగేది. జీవిత బీమా రంగంలో అప్పుడు సాంకేతికత ఇప్పుడు లేదు. ప్రస్తుతం గొప్ప ప్రజాదరణ పొందిన నేపథ్యంలో పరిశ్రమలు కీలకమైన భాగంగా మారిపోయింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక కొనుగోలుదారులకు చాలా రకాల సేవలను అందిస్తోంది.ఇక బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఆన్లైన్లో రివ్యూ లను చదవడం ద్వారా సమాచారం ఎంపిక చేసుకోవడం, బంధువులు, స్నేహితుల నుంచి అభిప్రాయం తీసుకోవడం కూడా సహాయపడుతుంది. ఇక మీకు తెలిసిన వారెవరైనా జీవిత బీమా పాలసీ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు అయితే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.