Tanguturi prakasam pantulu : చరిత్ర నిజాలు : మనందరి భవిష్యత్తు కి బాటలు వేసిన టంగుటూరి జీవిత విశేషాలు.

Tanguturi prakasam pantulu :  ప్రకాశం పంతులుగారి బాల్యం:
టంగుటూరి ప్రకాశం పంతులుగారి తల్లి దండ్రులు గోపాలకృష్ణయ్య,సుబ్బమ్మ. వీరి సంతానంగా ఆగస్టు 23, 1872న ప్రకాశంజన్మించడం జరిగింది.ఆయన తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం. వల్లూరులోనే ప్రకాశం గారి ప్రాథమిక విద్య పూర్తి చేసారు.

Tanguturi prakasam pantulu : అల్లరికి మారుపేరు:

అ ,ఆలు దిద్దుకునే వయసులోనే అల్లరితనానికి మారుపేరుగా నిలిచారు. గుండ్లకమ్మ ఈతకొట్టడం,సాముగరిడీలు, రౌడీలతో సహవాసం తాలింఖానాలో వ్యాయామం వంటి విషయాలలో దిట్ట గా మారారు. ​బ్రతుకు తెరువు కోసం అని గోపాలకృష్ణయ్య కుటుంబంతో కలిసి నాయుడుపేట కు చేరారు. ప్రకాశం పదకొండేళ్ల వయస్సులో ఉండగానే తండ్రి మరణించారు. తల్లి సుబ్బమ్మ గారు ఆరుగురు పిల్లలతో కొంతకాలం పాటు వినోదరాయుడు పాలెంలో అన్నగారింట వుండి, తన పిల్లలను విద్యావంతులు గా చేయడం కోసం ఎంతో కస్టపడి చదివించేది. పూటకూటిల్లు చూసుకోవడం అనేది సాటివారిలో తలవంపులు, ఆత్మగౌరవానికి భంగం అయినా కూడా తన పిల్లల అభివృధ్ధికోసంసాహసం చేసి ముందడుగు వేసిన సాహస మాతృమూర్తి సుబ్బమ్మ గారు.
ధార్వాడ నాటక కంపెనీ వారు 1885లో ఒంగోలులో నాటకాలను ప్రదర్శించారు. నాటకాలంటే ఎంతో మోజుగల ప్రకాశం గారు , రోజూ ఆ నాటకాలను చూడడానికి వెళ్లేవారు. మిషన్ హైస్కూల్ కి ఉపాధ్యాయులైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారికి , ఉర్దూ భాషలో నాటకాలు వ్రాస్తున్న వుండవల్లి సాహెబ్ గారికి ప్రకాశం అంటే చాలా ప్రేమ.

Tanguturi prakasam pantulu : తల్లి దీవెన:

హనుమంతరావు గారు ప్రకాశంను కన్నబిడ్డలా ప్రేమించేవారు. నాటకాలలో ప్రకాశం స్త్రీ పాత్రధారణ చేస్తూ మంచిపేరు పొందారు.
తల్లి సంపాదన వారి అవసరాలకు తగినంత వుండేది కాదు. ప్రకాశం గారు ధనవంతుల ఇళ్లలో వారాలు చేసుకుంటూ చదువుకునేవారు. మిడిల్ స్కూల్ పబ్లిక్ పరీక్ష ఫీజు కట్టడానికి మూడు రూపాయలు కూడా దొరకని కాలమది. బావగారిని నమ్ముకుని పాతికమైళ్ల దూరంలోని అద్దంకి కి, నడుచుకుంటూ వెళ్లి ఒట్టిచేతులతో తిరిగి వచ్చి తల్లితో తన బాధను చెప్పుకున్నారు. ఆ తల్లి సుబ్బమ్మ గారు తన పట్టుచీర తాకట్టుపెట్టి మరి ఆ డబ్బు సమకూర్చింది. ఆ పరీక్షలో ప్రకాశం గారు అందరికంటే మంచి మార్కులతో పాసైయ్యారు.

హనుమంతరావుగారి వాత్సల్యం:

హనుమంతరావు నాయుడుగారు ప్రకాశం చదువుకు ఫీజు కట్టవలిసిన అవసరం లేకుండా చేయించారు. ప్రకాశం మిషన్ హైస్కూల్ లో ప్రి మెట్రిక్ లో చేరాడు. నాయుడుగారిదయ వలన చదువు కు ఎలాంటి ఇబ్బంది రాలేదు. గొప్ప న్యాయవాది అవ్వాలన్న పట్టుదల ప్రకాశంలో పెరిగింది. నాయుడు గారికి ఒంగోలులో వచ్చే జీతం చాలదని రాజమండ్రి కి వెళ్లారు. అల్లరి ప్రకాశమును ఆంధ్ర ప్రకాశంగా తయారు చేసిన మహనీయుడు మహా మనిషి నాయుడుగారు. ప్రకాశాన్ని రాజమండ్రిలో ఎఫ్.ఎ. క్లాసులో చేర్పించారు. ప్రకాశం న్యాయశాస్త్రంచదువుకోవాలన్న కోరికను నాయుడిగారికి తెలియచేసారు . తండ్రి లా ఆదరించిన నాయుడుగారు, అప్పుచేసి మరి ప్రకాశంను మద్రాసుకు పంపించారు.ప్రకాశం మద్రాసు లా కాలేజీలో సెకండ్ గ్రేడ్ వకీలు పరీక్ష పాసై ఒంగోలులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు కానీ నాయుడుగారిపై ప్రేమకొద్దీ మరల రాజమండ్రి కే వెళ్ళిపోయాడు. అతి కొద్దికాలంలోనే రాజమండ్రిలోని న్యాయవాదులకు పక్కలో బల్లెం అయ్యారు ప్రకాశం.

 

గరపాలక సంఘ అధ్యక్షుడిగా :

ఆంధ్రప్రాంతంలో మొట్ట మొదట ఏర్పాటైన పురపాలక సంఘం రాజమండ్రి. ఆ సంఘంలోఉన్న సభ్యులందరూ ధనవంతులు,భూస్వాములు, ప్రసిద్ధ న్యాయవాదులు. అయితే ప్రకాశం ప్రతిభాపాటవాలు వారికి బాధ కల్గించాయి అనే చెప్పాలి. ప్రకాశం పలుకుబడి గల ప్రముఖులందరినీ చిత్తుచేసి రాజమండ్రి నగరపాలక సంఘ అధ్యక్షుడయ్యారు. అప్పటికి ఆయన వయస్సు ముప్పై35 సంవత్సరాలు. నగరపాలనాన్ని న్యాయంగా, నిర్భయంగా సాగించి ప్రజల మనస్సు గెలుచుకున్నారు. ​

మిత్రుల ప్రోత్సాహంతో:

మిత్రుల ప్రోత్సాహంతో, బారిష్టర్ పట్టా సంపాదించాలన్న సంకల్పం తో లండన్ కి పయనమయ్యారు.మాంసం, మద్యం, మగువజోలికి పోను అని తన తల్లి యెదుట ప్రతిజ్ఞ చేశారు. లండన్ లో తానే స్వయంగా వంటచేసుకుని తింటూ తన చదువును పూర్తి చేశారు. లండన్ లోని ఇండియా సొసైటీలో సభ్యుడుగా కూడా చేరాడు. దాదాబాయ్ నౌరోజి బ్రిటీష్ పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసినపుడు, ప్రకాశం గారు చాలా చురుకుగా పనిచేసి నౌరోజి విజయం సాధించేలా కృషి చేసారు. లా విద్యార్ధిగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ తో పాటు 50 పౌండ్ల బహుమతిని కూడా అందుకున్నారు. అలా బారిష్టరు పట్టాఅందుకున్న ప్రకాశం మద్రాసులో ప్రాక్టీసుమొదలు పెట్టారు. అప్పటి మద్రాసు హైకోర్టులో తమిళ లాయర్లుగా భాష్యం అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్ లు ప్రసిద్ధులు. ఆంగ్లేయులైన నార్టన్, గ్రాంట్ అను లాయర్లు కూడా బాగా పేరు సంపాదించారు. తన చదువు నిమిత్తం 20వేల రూపాయిలు అప్పుచేసిన ప్రకాశం తరువాతి రోజుల్లో ఒక చక్కని గ్రంథాలయం ఏర్పాటు చేసుకుని కొన్ని నెలల్లోనే హైకోర్టు న్యాయ వాదీ అయి మంచిపేరు , సంపాదన కూడా పొందారు. రోజు ఆదాయం వందలనుండి వేలకు చేరుకుంది.

పుట్టుకతో వచ్చిన లక్షణాలు:

నిరంతర పరిశ్రమ, ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం ఆయనకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. మద్రాసునుండి ప్రచురించబడుతున్న ‘లా టైమ్స్’ పత్రికలో వ్యాసం వ్రాస్తూ, న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు అని విమర్శా చేసారు. పద్నాలుగేళ్ళ బారిస్టర్ గా వుండి దాదాపు 15 లక్షల వరకు సంపాదించారు. బంధువులను ,మిత్రులను ఎందరినో ఆదరించాడు. తనను బిడ్డలా చూసుకున్న నాయుడు గారి కుటుంబానికెన్నో విధాలుగా సహాయపడ్డాడు.
సంపాదన:
ఉదక మండలంలో రెండు బంగళాలు, మద్రాసులోని మాదాకోవెల వీథిలో రెండున్నర ఎకరాల విస్తీర్ణం ఉన్న బంగళా, రాజమండ్రిలో, ఒంగోలులో పెద్దభవనాలు, గోదావరి డెల్టా క్రింద సుక్షేత్రాలైన భూములు సంపాదించుకోగలిగారు. తమ్ముళ్లు శ్రీరాములు, జానకీరామయ్యగార్ల కు మంచి చదువు చెప్పించాడు. శ్రీరాములుగారి కూతురే సినీనటి టంగుటూరి సూర్యకుమారి.

జాతీయోద్యమం పట్ల ఆశక్తి:

ప్రకాశం గారు జాతీయోద్యమం పట్ల ఆశక్తి చూపేవారు. అప్పటికి భారత రాజకీయ రంగంలో కి ఇంకా గాంధీజీ ప్రవేశించలేదు.
ప్రముఖ జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ 1908లో మద్రాసుకు రావడం జరిగింది. అతని సభకు అధ్యక్షతవహించడానికి ప్రముఖులుసైతం భయపడ్డారు. పిడుగులు కురిసినట్లు, వడగండ్ల వానలా బిపిన్ పాల్ చేసిన,గంభీరోపన్యాసం మద్రాసు ప్రజల్లో నూతన చైతన్యం తీసుకురాగలిగింది. ఆనాటి నుండి ప్రకాశం తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేస్తూ వచ్చారు.
జాతీయ భావాలను ప్రచారం చేయడం కోసం మద్రాసులో స్వరాజ్య పత్రికను అక్టోబర్ 29,1921న దినపత్రికగా మొదలు పెట్టారు. శ్రీయుతులు ఖాసా సుబ్బారావు, జి.వి. కృపానిధి కోటంరాజు పున్నయ్య,మున్నగు గొప్ప పాత్రికేయులు ‘స్వరాజ్య’ లో పనిచేశారు. తమిళులు చేత స్థాపించ బడిన హిందూ పత్రిక స్వరాజ్య ను తొక్కివేసేందుకు ​ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ స్వరాజ్య పన్నేండేళ్ళ పాటు నడిచింది.ప్రకాశంగారు లక్షల్లో అప్పులు చేశారు. తనకు ఉన్న బంగళాలను అమ్మి అప్పులు తీర్చారు. ఆయన ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారు.

తుపాకీలకు గుండెలు చూపించిన ధీరుడు:

1929లో సైమన్ కమీషన్ మద్రాసుకు వచ్చింది. మద్రాసులో ప్రకాశాన్ని బహిష్కరించ వద్దన్నారు గాంధీజీ.గాంధీ గారు ఇచ్చిన ఆదేశం ప్రకాశంగారికి అస్సలు నచ్చలేదు. రాజాజీ మెల్లగా తప్పుకున్నారు . ప్రకాశంపంతులు, దుర్గాబాయ్, రంగయ్యనాయుడు గార్లు, వేలాది ప్రజలతో వూరేగింపువెళ్తూ ‘సైమన్ గోబ్యాక్’ అని గర్జన చేసారు. బ్రిటీష్ తొత్తులైన సైనికులు తుపాకులతో కాలుస్తాం హెచ్చరించాడు. ఒక అజ్ఞాత దేశభక్తుడు తుపాకి గుళ్లకు బలిఅయ్యాడను వార్త దావానలంలా పాకింది. ప్రకాశం ఒక సింహంలా ముందుకు వచ్చారు. చొక్కా గుండీలు విప్పి”రండిరా ఇక్కడ కాల్చండి అని గుండెలిచ్చి చూపి నిలుచున్నాడు. తుపాకులు తలలు వంచక తప్పలేదు. దానితో ప్రకాశం పేరు దేశమంతటా వినిపించ సాగింది. ప్రమాదములున్న చోటనే ప్రకాశంగారుంటారు అన్న పట్టాభిగారి మాటలు నిజమనిపించాయి.

సత్యాగ్రహోద్యమం:

ప్రకాశంగారు సత్యాగ్రహోద్యమంలో ముమ్మరంగా పాల్గొని అనేక సార్లు జైలుకు కూడా వెళ్లారు. గాంధీజీని సైతం లెక్కచేయని ఆంధ్రనాయకులలో మొదటివారు ఎవరు అంటే అది ప్రకాశం గారే. రెండవవారు పేరు గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు అని చెప్పేవారు.
1937లో వచ్చిన ఎన్నికలలో సర్దార్ పటేల్ గారి ఒత్తిడిపై మద్రాసునుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రకాశంగారు ఆ ఎన్నికలలో గెలుపొందారు. ప్రకాశం మంత్రి అయినా తరువాత ముఖ్యమైన పనులు
రాయలసీమ కరువు ప్రాంతాలలో తానే స్వయంగా పర్యటించి కరువు పనులు ముమ్మరంగా మొదలయేలా చేసారు.
పంటలు చేస్తికి రానప్పుడు ధారాళంగా శిస్తు రెమిషన్ ఇప్పించేవారు.
శిస్తుభారంతో మోయలేని రైతులకు 75లక్షల శిస్తు ముజరాఇప్పించగలిగారు. రెండవ ప్రపంచ యుద్ధం రావటంతో కాంగ్రెస్ మంత్రివర్గం రాజీనామా చేయడం జరిగింది.

జైలు జీవితం:

ప్రకాశం ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలులో పెట్టారు.1945లో జైలు నుండి విడుదలైన తర్వాత రాష్ట్రమంతటా పరియటించినప్పుడు ప్రజలాయనను ఎంతో ప్రేమగా హారతులు పట్టారు. ప్రకాశంగారు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిర్కా డెవలప్ మెంట్ స్కీమ్ ఉత్పత్తిదారుల వినియోగదారుల సహకార సంఘాలు స్థాపించారు. గాంధీజీ, రాజాజీ వంటి నాయకులు ప్రకాశంగారికి వ్యతిరేకంగా కుట్ర చేయడం వలన ప్రకాశం ప్రభుత్వం పడిపోయింది.అప్పుడు కాంగ్రెసును వదలి ప్రజాపార్టి ని స్థాపించారు.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ త్యాగం తో 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరణ జరిగింది.

తొలి ముఖ్యమంత్రి:

ఆంధ్ర ప్రజల కోర్కె ప్రకారం ఆంధ్రనాయకుడైన ప్రకాశం తొలి ముఖ్యమంత్రిగా ఉండగా, కర్నూలు రాజధానిగ ఉంది . ప్రకాశంగారు గుంటూరులో హైకోర్టు ను , తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసే నిధుల కోసం ఎదురుచూడకుండా కృష్ణాబ్యారేజీ నిర్మించారు. అయితే ఏడాదిలోపే ఆయనపై అవిశ్వాసతీర్మానం పెట్టడం తో పదవి పోయినా ప్రకాశాన్ని ప్రజలు మహారాజుగా గౌరవించి గుండెల్లో పెట్టుకున్నారు. ప్రకాశం ఒక మహాసాహసి అని చెప్పవచ్చు. రోమన్ సేనాపతిలా అచంచలమైన పట్టుదల కలిగిన మొనగాడు. కష్టసుఖాలను సమభావంతో చూచిన స్థితప్రజ్ఞుడు ప్రకాశం. కృషి చేయడమే పరమాత్ముని పూజగాభావించిన వ్యక్తి.

ఆర్జించిన సర్వం ప్రజలకు:

ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినప్పటికీ,ఎన్నో గొప్పపదవులు నిర్వహించినప్పటికీ ఎంతో గొప్పగా సంపాదించినప్పటికీ ఆయన ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న పద్దతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చిరిగిన బట్టలు ల్లో, ఆహారం లేకపోవడం వలన నిరసించిపోయిన ముఖంతో విజయవాడ వీధుల తో పాటు , రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఎప్పటికి మరచిపోలేకపోయారు.
ప్రకాశం గారులక్షలు సంపాదించి కూడా , చివరికో చిల్లిగవ్వను కూడా దాచుకోలేదు. ఆఖరి దశలో రాష్ట్ర ప్రభుత్వంవారు ప్రకాశంగారికి నెలకు రు.750/- గౌరవభృతి తో పాటు సొంతవుపయోగం కోసం ఒక కారు యిచ్చారు.
ఆంధ్రజాతికి తిరుగులేని నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన ప్రకాశం వీరుడైన భీష్మునిలా మే 20 , 1957 లో ఆయనమరణించారు.