Health Benefits : గోంగూర తో ఇన్ని లాభాలు ఉంటాయని ఊహించారా.?

Health Benefits : రెండు తెలుగు రాష్ట్రాల్లో గోంగూర గురించి తెలియని వారు ఉండరు.. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, బోటి గోంగూర వంటి ఎన్నో ఎన్నో రకాలుగా గోంగూరని మనం తరచూ వాడుతుండటం.. ఆంధ్ర లో గోంగూర గాను తెలంగాణలో పుంటి కూర అని పిలుస్తారు.. ఆంధ్రమాత పిలవబడే గోంగూర పోషక విలువలకు మరొక ఆకుకూర సాటి రాదు.. గోంగూర తినడం వలన ప్ర‌యోజ‌నాలు ఏంటీ? అన్న‌ది లేట్ చేయ‌కుండా చ‌క‌చ‌కా తెలుసుకుందాం..

గోంగూరలో కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, పొటాషియం, ఇనుము, ఫైబ‌ర్‌, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ల‌భ్య‌మ‌వుతాయి. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తాయి. గుండెకు రక్త ప్రసరణ స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంతో పాటు రక్తపోటు రాకుండా ఉండేలా చేస్తాయి.
షుగర్ పేషెంట్స్ లో గోంగూర కూడా ఒక పాత్ర వహిస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.

health benefits of Gongura
health benefits of Gongura

అందుకని వారానికి ఒక్క రోజు అయినా సరే మనం తీసుకునే ఆహారంలో గోంగూరను చేర్చడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడుతున్న వారు గోంగూరను ఏదో విధంగా తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపు స్పష్టంగా కనిపిస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అధిక బరువు తో బాధపడుతున్న వారు తరచూ తీసుకుంటే బరువు తగ్గుతారు.