Temple : ఆ గుడిలో భగవంతుడికి మటన్ బిర్యానీ ప్రసాదంగా పెడతారని మీకు తెలుసా..?

Temple : సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో హిందువులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ప్రతి గుడిలో కూడా పులిహోర లేదా దద్ధోజనం వంటి పదార్థాలను మాత్రమే నైవేద్యంగా ప్రసాదిస్తారు. అయితే హిందూ దేవాలయాలు అన్నింటిలో కూడా చాలా విభిన్నమైన గుడి తమిళనాడులోని మునీశ్వరుడు ఆలయం ఒకటి ఉంది అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రసాదంగా మటన్ బిర్యాని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక కేవలం భగవంతుడికి మాత్రమే కాదు భక్తులకు కూడా ఎంత అడిగితే అంత అన్నట్లుగా మటన్ బిర్యానీ అక్కడ స్థానికులు పంచుతూ ఉంటారు.

ఇక ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాలకు వస్తే తమిళనాడులోని మధురై జిల్లాలో ఉన్న తిరుమంగళం సమీపంలో వడుకం పట్టి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో మునీశ్వరుడి ఆలయం ఉంది. ఆ ఆలయం లో జనవరి 25 వ తారీఖున 2000 కిలోల బాస్మతి రైస్ అలాగే 500 కేజీల మటన్ తో చేసిన బిర్యాని ప్రసాదంగా పెట్టారు. అయితే ఎక్కడా లేని వింత ఆచారం తమిళనాడులో జరగడంతో ఈ దేవాలయం గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే సుమారు 85 సంవత్సరాల క్రితం సుబ్బానాయుడు అనే ఒక వ్యక్తి మునీశ్వర పేరుతో హోటల్ ను ప్రారంభించారట.

Did you know that mutton biryani is offered to God in that temple
Did you know that mutton biryani is offered to God in that temple

ఆ హోటల్ లో బిర్యానీ అమ్మేవాడు. ఆ హోటల్ కి మంచి పేరు రావడం, డబ్బులు బాగా సంపాదించడం తో ప్రతి సంవత్సరం మునీశ్వరుడు కి మటన్ బిర్యాని ప్రసాదంగా పెడుతూ వస్తున్నాడు సుబ్బనాయుడు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడ ఎన్నో మటన్ బిర్యానీ హోటల్ లను ప్రారంభించి బాగా డబ్బు సంపాదించడం తో ఇక ఆ స్వామి వారికి శాశ్వతంగా బిర్యాని ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది బిర్యానీని స్వామివారికి ప్రసాదంగా సమర్పించడం కొంత మంది హిందువులు తప్పుపడుతున్నారు. మరికొంతమంది స్వామివారికి శాకాహారమే నైవేద్యంగా పెట్టాలన్న రూలేమీ ఎక్కడా లేదు కాబట్టి మాంసాహారం అయినా సరే ప్రసాదంగా పెట్టవచ్చు అంటూ వాదిస్తున్నారు. ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్లయితే సమాచారాన్ని అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.