Vastu Shastram : సంపన్నులు కావాలంటే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?

Vastu Shastram : డబ్బు ఎవరికి మాత్రం చేదు.. అపర కుబేరులు అయినా..పేదవాళ్లు అయినా ఎవరైనా సరే ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ డబ్బు సంపాదన కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు అనేది జీవనానికి పునాది గానే చెప్పాలి. మనం జీవించాలంటే డబ్బు లేనిదే కష్టం అవుతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ చేసే ప్రతి పనిలోనూ డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఇక అందుకే ధనం మూలం ఇదం జగత్ అని అంటారు.. నిజమే కదా డబ్బు లేనిదే ఏ పని చేయలేము అన్నింటికీ డబ్బే ముఖ్యం డబ్బుతో అన్ని కొనలేకపోవచ్చు కానీ డబ్బుంటేనే ఎన్నో సమస్యలు తీరిపోతాయని ప్రతి ఒక్కరు అనుకుంటారు.

కానీ కొంతమంది ఎంత డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు మిగలదు.. మరికొందరికి సంపాదిద్దాం అనుకున్నా చాన్స్ ఉండదు. ధనం యోగం పడితే మాత్రం అప్పుల బాధలు తీరి పోవడమే కాదు సిరిసంపదలతో హాయిగా జీవిస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక ధనవంతులు కావాలనే కోరికలు నెరవేరాలని అంటే వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఎవరైనా సరే డబ్బు ప్రయత్నాల చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

If you want the rich tips in Vastu Shastra about
If you want the rich tips in Vastu Shastra about

మీరు నిద్రపోయే స్థలం ముఖద్వారానికి ఎదురుగా ఉన్నట్లయితే ఆ గోడకు చివర్లో ఏదైనా లోహపు వస్తువులు పెట్టాలి. వాస్తవానికి ఈ స్థలాన్ని సంపదకు నెలవుగా చెబుతారు.. ఇక లక్ష్మీ దేవి ఫోటోలు చాలా మంది లాకర్లలో డబ్బు , నగలతో సహా పెడుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి ఫోటో ను మీ డబ్బులు పెట్టే లాకర్లో పెట్టినట్లయితే మీ డబ్బులకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఇక మీ ఇంట్లో చెత్తాచెదారం అసలు ఉంచకండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరిగి నెగటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. విరిగిన మంచాన్ని కూడా ఇంట్లో ఉంచరాదు . ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభాల్లో తగ్గుదల కనబడుతుంది. ఇంటి మెట్ల కింద పాత సామాన్లు కూడా పెట్టకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగా నష్టం వాటిల్లదు.