Bigg Boss7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తారీకు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ షో ప్రసారం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో.. సీజన్ సెవెన్ టైమింగ్స్ కూడా స్పష్టం చేశారు. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు షో ప్రసారం కాబోతుందని పేర్కొన్నారు.
ఇక శని ఆదివారాలలో 9 గంటలకే షో ప్రసారం అవుతుందని స్పష్టం చేయడం జరిగింది. యధావిధిగా స్టార్ మాతోపాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా షో ప్రసారం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈసారి సీజన్ సెవెన్ కి లైవ్ ఉండదని సమాచారం. ఎందుకంటే గతంలో లైవ్ ఇచ్చిన క్రమంలో ఆ సీజన్స్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి అటువంటిది జరగకుండా.. షో నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారట.
ఇక ఇదే సమయంలో ఈ సీజన్ లో పోటీదారులందరూ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లేనట. గతంలో సోషల్ మీడియా కి చెందిన వాళ్లతో పాటు టెలివిజన్ రంగానికి చెందిన వాళ్లను తీసుకున్నారు. అయితే వాళ్లు చాలామందికి తెలియక పోవడంతో..షో చూడటానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఈసారి అందరికీ తెలిసిన ముఖాలు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనే షో నిర్వాహకులు తీసుకోబోతున్నారట.