Vijay Deverakonda: పెళ్లి చేసుకోబోతున్నట్లుగా విజయ్ దేవరకొండ సడన్ ప్రకటన.!!

Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “పెళ్లిచూపులు” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డామ్ సంపాదించాడు. ఆ తర్వాత “గీత గోవిందం” సినిమాతో మంచి రొమాంటిక్ హిట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమాతో అమ్మాయిల లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వర్షం ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఖుషి” సినిమా చేయడం జరిగింది.

ఈ సినిమా పైన ఇప్పుడు ఆశలన్నీ పెట్టుకున్నాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. భార్యాభర్తలుగా విజయ్ దేవరకొండ…సమంత నటించినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టడం జరిగింది.

Vijay Deverakonda's sudden announcement that he is going to get married

ఈ పోస్టులో ఓ అమ్మాయి చేతిని తన చేతిలో ఉంచుతూ.. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అయితే ఇది చాలా స్పెషల్ అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్స్ మాత్రం విజయ్ త్వరలో పెళ్లిచేసుకుంటున్నారని.. ఈ పోస్ట్‌కు అర్థం ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క కృషి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ రకమైన పోస్ట్ చేసి ఉండొచ్చని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.