Rahul Sipligunj: పొలిటికల్ ఎంట్రీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్..!!

Rahul Sipligunj: తెలుగు చలనచిత్ర రంగంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అందరికీ సుపరిచితుడే. తన గాత్రంతో ఎన్నో వైవిధ్యమైన పాటలు పాడటం జరిగింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అనేక సినిమాలలో కీరవాణి ఆధ్వర్యంలో చాలా హిట్ సాంగ్స్ పాడాడు. “RRR” సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ “నాటు నాటు” పాట రాహుల్ సిప్లిగంజ్… ఆలపించడం జరిగింది. ఈ పాటకి ఆస్కార్ అవార్డు గెలుచుకోవటం తెలిసిందే.  తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో విజేతగా కూడా గెలవడం జరిగింది.

ఆ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ తన బెస్ట్ ఇవ్వటం జరిగింది. ఏదైనా మొఖం మీద మాట్లాడి.. మాస్క్ లేని గేమ్ ఆడి.. బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. సింగర్ గా గుర్తింపు సంపాదించాక బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మరింతగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నాడు. ఈ క్రమంలో కృష్ణవంశీ దర్శకత్వంలో “రంగమార్తాండ” సినిమాలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఏడాది 93వ ఆస్కార్ అవార్డు వేడుకలలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇద్దరు స్టేజిపై పాడటం మరొక్క ఎత్తు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ ఒక్కసారిగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

Singer Rahul Sipliganj gave clarity on the news of political entry

రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత తెలంగాణకి వచ్చాక.. కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సత్కరించి.. ప్రోత్సాహకరంగా ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాహుల్ సిప్లిగంజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వైరెల్ అవ్వుతున్నయి. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ప్రధాన పార్టీలు ఇంకా కేసీఆర్ పార్టీ సైతం.. రాహుల్ సిప్లిగంజ్ చేత పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని రాహుల్ సిప్లిగంజ్ స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుడు మరియు పార్టీ నేతలు తనని కలవలేదని ఇటువంటి రూమర్స్ నమ్మద్దని సూచించారు.