Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ అన్నిటిలో ఈసారి సీజన్ చాలా వెరైటీ స్పెషాలిటీ ఇదే..!!

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ కావడానికి మరి కొద్ది రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ మూడవ తారీకు అనగా ఈ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు షో ప్రసారం కానుంది. అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఇండియాలో జరుగుతూ ఉండటంతో దాని ఎఫెక్ట్ షోపై పడకుండా నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.This is the most variety specialty of the Telugu Bigg Boss season

ఇదే సమయంలో ఈసారి సీజన్ గత సీజన్ లకు భిన్నంగా చాలా వెరైటీగా సెట్ చేయటం జరిగిందట. విషయంలోకి వెళ్తే ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉండబోతున్నాయట. ముందుగానే రెండు గ్రూపులుగా ఇంటి సభ్యులను డివైడ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతి వీకెండ్ లో హౌస్ కి ఒకరు చొప్పున.. ఒక్కరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే రీతిలో.. ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నట్లు టాక్.

అంతేకాదు కెప్టెన్ కి కూడా స్పెషల్ రూమ్ ఈసారి ఉండనుందని సమాచారం. ఈ రకంగా సీజన్ సెవెన్ నీ షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షోలో ఆరు సీజన్లలో ఎన్నడు ఈ రీతిగా హౌస్ సెట్టింగ్ లేదు. కానీ ఫస్ట్ టైం కంటెస్టెంట్లను రెండుగా డివైడ్ చేసి.. రెండు హౌసులు క్రియేట్ చేయడంతో పాటు.. కెప్టెన్ కి స్పెషల్ రూమ్ కేటాయించడం ఇదే ఫస్ట్ టైం. సో వచ్చిన వార్తలు బట్టి.. హౌస్ సెట్టింగ్ ఉంటే మాత్రం షో మొదటినుండే రసవత్తరంగా ఉంటుందని బిగ్ బాస్ ఆడియన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.