Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలవడం తెలిసిందే. 2021 ఏడాదిలో వచ్చిన పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ అవార్డు అందుకోవటం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న మొట్టమొదటి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించారు. దీంతో చాలామంది సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఇంకా రాజకీయ నేతలు సెలబ్రిటీలు బన్నీని అభినందించడం జరిగింది. తాజాగా ఏపీ.ఎఫ్.డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గొప్ప నిర్మాత కొడుకు అయిన గాని అతనిలో నేర్చుకునే గుణం ఉందని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఒకరోజు ఫోన్ చేసి.. టీ తాగడానికి ఇంటికి రావాలని బన్నీ ఆహ్వానించాడు. ఆ సమయంలో ఐదు లక్షల చెక్కు నాకు ఇచ్చాడు. ఇది ఎందుకని.. నేను ఆల్రెడీ చాలా బాగానే ఉన్నానని..అంటే.. మీరు డబ్బులని కరెక్ట్ గా ఖర్చు పెడతారు. ఎంతోమందికి మీరు సాయం చేస్తూ ఉంటారు. అందుకే మీకు ఈ అమౌంట్ ఇచ్చాను. దయచేసి తీసుకోను అనొద్దు అని బన్నీ డబ్బులు ఇచ్చాడు.
ఆ డబ్బులను కటిక పేదరికంలో మెరిట్ మార్కులతో పాసైన పదో తరగతి విద్యార్థుల చదువుకు ఉపయోగించడం జరిగింది. వాళ్లందరికీ ఓ ప్రముఖ మీడియాలోనే డబ్బులు అందించి వెంటనే అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలపాలని.. చెప్పడం జరిగింది. ఆ తర్వాత బన్నీ మళ్లీ ఇంటికి పిలిపించుకుని ఇలా చేశారేంటి అని అన్నారు. మరి సొమ్మొకడిది సోకొకడిది అంటే కుదరదు. ఏ డబ్బులు నువ్వు చేసిన సాయం అందరికీ తెలియాలి కదా అని ఆ విధంగా వ్యవహరించినట్లు పోసాని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తాను సీనియర్ అయినా.. నేనంటే బన్నీ ఎంతో ఇష్టపడతాడు అంటూ చెప్పుకొచ్చారు.