అవును, మీరు విన్నది నిజమే. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం ఏపీ దురదృష్టకరం. కొన్నాళ్ల క్రితం ఏపీలో సహజ వనరుల విధ్వంసం కారణంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించిన సంగతి అందరికీ తెలిసినదే. పేదల ఇళ్ల స్ధలాల కోసమనే నెపంతో కాకినాడ జిల్లాలో తుఫానులు, సునామీ నుంచి తీర ప్రాంతాల్ని కాపాడుతున్న మడ అడవుల్ని అధికారులు విధ్వంసం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. దీనిపై మొదట కొందరు జనసేన నేతలు జాతీయ హరిత ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ రూ.5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది.
కాకినాడ శివారు దమ్మాలపేట సమీపంలో 116 ఎకరాల్లో CRZ పరిధిలోకి వచ్చే భూముల్లో 416 మందికి ప్రభుత్వం ఇళ్ల స్ధలాలు ఇవ్వాల్సి ఉండడంతో అధికారులు హుటాహుటిన భూముల సేకరణ చేపట్టి అక్కడ మడ అడవులను నరికేసి చదును చేసేశారు. దీనిపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణతో పాటు మరొకరు జాతీయ హరిత ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా వెంటనే మడ అడవుల విధ్వంసం ఆపాలని, నరికేసిన వాటిని మరలా పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపథ్యంలో మడ అడవుల్ని ఇళ్ల స్ధలాల కోసమంటూ నరికేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ దారుణంగా తప్పుబట్టింది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వానికి దీనికి పరిహారంగా రూ.5 కోట్ల రూపాయలు జరిమానా విధించింది.
అంతేకాకుండా కాకినాడలో కనుమరుగైన మడ అడవుల్ని తిరిగి పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకుగాను జగన్ కి 5 సంవత్సరాలు గడువు ఇచ్చింది. ఐదేళ్లలో కనీసం 85 శాతం మడ అడవులు తిరిగి అదేచోట పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ పనులపై ప్రతి 6 నెలలకోసారి నివేదిక ఇవ్వాలని కూడా సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఎన్జీటీ 6 మంది సభ్యులతో కూడిన కమిటీ ఒకదానిని ఏర్పాటు చేసింది. వారంతా వాస్తవంగా అక్కడేం జరిగిందో ఆరు నెలలకొకసారి జాతీయ హరిత ట్రైబ్యునల్ కి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇదే ఒక పరువు తక్కువ పని అనుకుంటే జగన్ ప్రభుత్వం మరో ఘనకార్యం చేసింది.
అవును, ఆ విషయం మరిచిపోకమునుపే జగన్ ప్రభుత్వానికి మరొక భారీ షాక్ తగిలింది. దేశంలోనే ఇలాంటి తీర్పు వెలువడడం ఇదే తొలిసారి అని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. విషయం ఏమిటంటే, జగన్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో నిధులను అప్పుతీసుకొని అడ్డగోలుగా సొంత అవసరాలకోసం దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలతో సుప్రీం కోర్ట్ 16 కోట్ల ఫైన్ వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాయలసీమ కరువు నివారణ నెపంతో జగన్ తీసుకున్న భారీమొత్తాన్ని అంటే సుమారు 900 కోట్ల రూపాయిలను తనకు అనుకూలమైన కొన్ని ప్రైవేట్ కంపెనీలకు మళ్ళించాడనే ఆరోపణలతో ఈ ఫైన్ విధించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా స్పందించకపోవడం కొసమెరుపు.