కేంద్ర మంత్రులతో మహేష్ బాబు భేటీ.. అక్కడ రూ.3,000 కోట్ల ఆసుపత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!

ప్రిన్స్ మహేష్ బాబు చిన్నారుల ప్రాణాలను కాపాడాలని ఎల్లప్పుడూ తపన పడుతుంటాడు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలందరికీ మెరుగైన వైద్యం అందాలని నిత్యం కోరుకుంటాడు. అంతేకాకుండా తన సొంత డబ్బులతో ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా వైద్య చికిత్స చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. ఎవరూ కూడా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని, దురదృష్టం కొద్దీ అనారోగ్యం బారిన పడినా వారికి మెరుగైన వైద్యం చేకూరాలని కోరుకుంటాడు. అలాంటి మంచి మనస్తత్వం ఉంది గనుకే కేంద్రానికి వెళ్లి మరీ మూడు వేల కోట్ల విలువైన హాస్పటల్‌ని తాను పుట్టిన బుర్రుపాలెంకి తీసుకొస్తున్నాడట.

కేంద్రం కూడా అతని విజ్ఞప్తిని మన్నించి అతని నేటివ్ ప్లేస్ లో హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలను తీసుకొచ్చేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. మూడు వేల కోట్లతో నిర్మితమయ్యే ఈ హాస్పిటల్ అన్ని రోగాలను నయం చేసే ఫెసిలిటీస్ తో అందుబాటులోకి వస్తుందని సమాచారం. బుర్రిపాలెం చుట్టుపక్కల ఉన్న వారందరికీ మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో మహేష్ కేంద్రానికి వెళ్లి మరీ అమిత్ షా వంటి వారిని బతిమిలాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సంగతి తెలిసిన బుర్రిపాలెం ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. కాగా కేంద్రం నుంచి బుర్రిపాలానికి హాస్పిటల్ వస్తుందనేది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇప్పటివరకు దీని పై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదని గమనించాలి. ఇకపోతే మహేష్ తన లాగానే ప్రతి ఒక్క సెలబ్రిటీ తమ తమ పుట్టిన ప్రదేశాలకు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను తీసుకురావాలని కోరుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ భారీ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మహేష్ సమాజం బాగుకోసం ఆలోచించడం గర్వంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.