నిహారికకు ఝలక్కిచ్చిన చైతన్య… గొల్లుమంటున్న సోషల్ మీడియా?

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో వివాహానికి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు వివాహితులు ఎలాంటి సమస్యలు వచ్చినా కలకాలం ఉండడానికి ట్రై చేసేవారు. ప్రస్తుత స్మార్ట్ యుగంలో పెళ్లి చేసుకుంటున్న జంటలు రకరకాల కారణాలతో విడిపోవడం పరిపాటిగా మారింది. అంతెందుకు మధ్య తరగతి కుటుంబాలలోకి కూడా విడాకుల సంస్కృతి వచ్చేసింది. ఇపుడు ఎవరూ కాంప్రమైజ్ అయిన పరిస్థితి లేదు. అలాంటిది సమాజంలో పేరుమోసిన కుటుంబాలలో పెరిగే పిల్లలు ఇంకెలా ఆలోచిస్తారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంకా సినిమా సెలిబ్రిటీల జీవితాలు అయితే మనవాళ్లకు చాలా లోకువ. వారు ఏం చేసినా పెద్ద న్యూస్ అయిపోతుంది.

ఇటీవల మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో ఏ రేంజులో హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసినదే. పెళ్ళైన కొన్నాళ్లకే నిహారిక – చైతన్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇదేమంత వివాదాస్పదమైన సంఘటన కాదు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు. అయితే విడాకులు తీసుకుంటే మన సమాజం ముందుగా అమ్మాయినే తప్పుబడుతుంది. ఈ విషయంలోనే నిహారికను ట్రోల్స్ చేస్తూ అనేకరకాల కధనాలు వెలువడ్డాయి. నిహారిక మరియు చైతన్య విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కానీ నిహారిక తండ్రి నాగబాబు వలెనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని, మెగా ఫామిలీ ఎంట్రీతోనే వారు విడిపోయారని… ఇలా రకరకాల కధనాలు వెలువడ్డాయి.

అది చాలదన్నట్టు ఇపుడు కొత్త మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరు ఓ విషయంలో పోటీ పడుతున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ కావడం మనం గమనించవచ్చు. విడాకులు తీసుకోక ముందు, చైతన్య నిహారిక కలిసి జిమ్‌కు వెళ్లిన ఫొటోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఇక విడాకుల తర్వాత నిహారిక వితికా షెరుతో కలిసి జిమ్‌కు వెళ్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దీనికి ముందే చైతన్య కూడా జిమ్‌లో ఉన్న ఓ ఫొటో షేర్ చేయడం జరిగింది. ఇది చూసిన నెటిజన్స్ ఆ విషయాన్ని భూతద్దంలో చూపించి రాస్తున్నారు. విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ, జిమ్ ఫొటోస్ పెడుతూ మాజీ భార్యభర్తలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా వీటిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరిష్టం వారిది, ఇపుడు ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు కదా. వాళ్ళనెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తే, మరికొందరు చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో నెగిటివ్ గా ఏ చిన్న ఘటన జరిగినా భూతద్దంలో చూసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఐతే నిహారిక తన గురించి తప్పుగా ప్రచారంలోకి వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నిహారిక ఇపుడు తన కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నట్టు కనబడుతోంది. నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.