జగన్‌కి మరోసారి సుప్రీం కోర్ట్ చురకలు… విషయాన్ని బట్టబయలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాల్ని నిషేధిస్తూ గతంలో ఎన్టీటీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాజాగా సమర్ధించిన సంగతి విదితమే. దాంతో ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ప్రభావం ఎంత వరకూ పరిమితం అన్న దానిపై గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అయితే జరపొచ్చుగానీ, అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా తవ్వకాలు చేస్తే చూస్తూ ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీపరీవాహక ప్రాంతాల్లో బి-2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరిలో 18 ఒపెన్ ఇసుక రీచ్ లకు ఇచ్చిన అనుమతులను సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఈమేరకు తాజాగా మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను సదరు సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తరువాతే ఈ 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని అన్నారు. అలాగే పర్యావరణంకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు ఈ 18 రీచ్ లపై ఎన్జీటి విధించిన జరిమానాకు సుప్రీంకోర్ట్ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని కూడా వెంకటరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 18 ఇసుక రీచ్ లకు సంబంధించి ఎన్జీటిలో దాఖలైన కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వాటిల్లో తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని గనులశాఖ ఆదేశించిందని కూడా అయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ విషయాన్నే తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో కాస్త విపులంగా చర్చిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఎన్నాళ్లీ అక్రమ తవ్వకాలు అంటూ కడిగిపారేశారు. మీ పాపం పండే సమయం దగ్గర పడుతోందని, జనాలు ఓట్ల సునామీలో కొట్టుకుపోయేలా చేస్తారని మండిపడ్డారు. ఇకపోతే, మొన్నటికి మొన్న 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆశలపై సుప్రింకోర్టు నీళ్ళు చల్లిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలోనే మంగళవారం అంటే ఈనెల 11వ తేదీన 3 రాజధానులపై జరగాల్సిన విచారణను ఏకంగా డిసెంబర్ కు వాయిదా వేసింది. విషయం ఏమిటంటే ఒక కేసు విచారణను ఏకంగా ఇలా 5 నెలలుపాటు వాయిదా వేయడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం కొసమెరుపు. ఎంత వీలైత అంత తొందరగా రాజధానుల వివాదాన్ని సుప్రింకోర్టు క్లియర్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వం చాలాసార్లు కోరినా ఇదే నత్తనడక సాగడం గమనార్హం.

సుప్రింకోర్టులో విచారణ తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని జగన్ ఆశించారు. కానీ సుప్రింకోర్టు మాత్రం అంతకు మించిన అనేక కేసులు అత్యవసర జాబితాలో ఉన్నాయని వారికి చెబుతూ షాక్ ఇవ్వడం ఒకింత విడ్డురమే అని చెప్పుకోవాలి. ఇకపోతే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటికి మొన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకు పడిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఏ రోజు కేతిరెడ్డి గురించి మాట్లాడింది లేదు. కానీ అతను తాడిపత్రికి వచ్చి నాపై పిచ్చి కూతలు కూశాడు. నన్ను ముసలివాడు, కుంటివాడు అని అంటున్నారు. అయితే అది వాస్తవమే. కానీ నాలాగా మీరు పని చేయగలరా? అంటూ ప్రశ్నించారు. మీదంతా నేరాల జీవితం. మేమిలా జీవించటలేదు అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.