నిహారిక విడాకుల వరకు వెళ్తుందని అస్సలు అనుకోలేదని బాధపడుతున్న మహేష్ బాబు?

ఇటీవల కొన్ని రోజులనుండి మెగా డాటర్ నిహారిక గురించి ఎక్కువగా వార్తలు నడుస్తున్న సంగతి విదితమే. ఓ సాధారణమైన జంట విడిపోతే జనాలు పట్టించుకోరు గానీ, అదే సెలిబ్రిటీలు అయితే అంత తేలిగ్గా విడిచి పెట్టారు. వారి గురించిన విషయాలు శోధిస్తూ వుంటారు. మరోవైపు మీడియాలు కూడా అదేపనిగా సెలిబ్రిటీస్ పర్సనల్ విషయాలను కెలుకుతూ వుంటారు. ఇక ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో మరో జంట విడిపోయిన సంగతి తెలిసినదే. అవును, పెళ్లయినాక ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య. 2020 డిసెంబర్‌లో వీళ్ళ వివాహం ఓ పండగలా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఈ పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా ఓ రాజుల కోటలో వీళ్ళ పెళ్లి జరిగిన విషయం అందరికీ విదితమే.

మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు వీరు బాగానే కాపురం చేసినా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది. చైతన్య సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్ కావడం.. నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. అందుకే కొన్ని రోజులు కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నా కూడా పరిష్కారం కాకపోవడంతో చివరికి విడాకుల బాట పట్టారు నిహారిక – చైతన్య. చాలా రోజులుగా వీళ్ళు ఇద్దరు వేరువేరుగానే ఉంటున్నప్పటికీ అధికారికంగా వీరికి ఇప్పుడు విడాకులు మంజూరు అయ్యాయి.

ఇక పెళ్లి తర్వాత నిహారిక కొన్ని రోజుల పాటు ఫోటోషూట్స్ కానీ, సినిమాలు గానీ చేయలేదు. దీన్ని బట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నిహారిక మునుపటిలా మళ్ళీ సినిమాలు చేస్తూ, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది… అది వేరే విషయం. ఈ విషయంలో ముఖ్యంగా ఆ ఇరు కుటుంబాలకు చెడిందంటూ వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా, కారణం మరేదైనా ఒకరితో ఒకరు కలిసి ఉండలేం అని నిర్ణయించుకున్న తర్వాత విడిపోవాలని విడాకులకు అప్లై చేసుకున్నారు ఈ జంట. మే 19న కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్న వీళ్ళకు.. తాజాగా డివోర్స్ మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇంకేముంది దాంతో అధికారికంగా ఇద్దరు విడిపోయారు.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన కొంతమంది శ్రేయోభిలాషులు ఒక్క మెగా కుటుంబానికే ఇలా ఎందుకు జరుగుతుందని గుసగుసలు ఆడుకుంటున్నట్టు వినికిడి. తాజాగా ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయినట్టు సమాచారం. మెగాస్టార్ కి సూపర్ స్టార్ కి వున్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసినదే. దాంతో అప్పుడప్పుడు మహేష్ మెగాస్టార్ చిరు ఇంటికి వెళుతూ వుంటారు. తాజాగా అలా వెళ్లినపుడు నిహారిక విషయం తెలిసి చాలా బాధ పడ్డాడట మహేష్ బాబు. అంత మంచి పిల్లకి కూడా దేవుడు మంచి జీవితం ఇవ్వలేదని చిరు ఎదుట వాపోయాడట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.