బ్రేకింగ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై కేసు నమోదు కావడంతో హడావుడిగా బయల్దేరిన కేటీఆర్?

గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే… ముఖ్యమంత్రి కేసిఆర్ పైన కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటి విషయాలు బాగా చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ పై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. గోదావరి వరద భాదితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో సీఎంపై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం ఏమంటే గత ఏడాది జూలై 17న సీఎం కేసిఆర్ భద్రాచలంలో పర్యటించిన నేపథ్యంలో గోదావరి వరద గండం నుంచి గట్టెక్కించేందుకు భద్రాచలం వద్ద రూ. వెయ్యి కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తన వాగ్దానాన్ని గట్టున పెట్టిన నేపథ్యంలో ఆప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.

అదే విధంగా లోతట్టు కాలనీలైన సుభాస్ నగర్ ముంపు బాధితులకు మరోచోట డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మాణం చేస్తామని హామీలు మీద హామీలు ఇచ్చేసారు ముఖ్యమంత్రి కేసిఆర్. కాగా ఆ హామీలు ఇచ్చి నేటికీ ఏడాది గడిచినా సీఎం కేసీఅర్ మాట తప్పడంతో ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆ ప్రాంత వాసులతో పాటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ఆయన మోసం చేసారని, గతంలో రామాలయ అభివృద్ధికి కూడా ఇదే విధంగా రూ.100 కోట్లు ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా భద్రాచలం ప్రాంత వాసులు మాట్లాడుతూ… ప్రస్తుతం అక్కడ భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా? వాపోతున్న పరిస్థితి. కాబట్టి సీఎం కెసిఆర్ త్వరగా ఇచ్చిన వాగ్దాలను నెరవేర్చాల్సిందిగా కోరుతున్నారు. ఇకపోతే గత ఏడాది వరదల సమయంలో భద్రాచలం పట్టణాన్ని పర్యవేక్షించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ కరకట్ట పటిష్టత, ఎత్తు పెంచడానికి, ముంపు కాలనీల ప్రజలకు పునరావాసం కల్పించడానికి రూ.1,000 కోట్లు ప్రకటించిన సంగతి విదితమే. కాగా ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు యధావిధి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. త‌క్ష‌ణం ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌కు, అభివృద్ధి ప‌నుల‌కు వెంట‌నే నిధులు విడుద‌ల చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇకపోతే, ముఖ్యమంత్రి కేసిఆర్ పై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసారని తెలియడంతో మంత్రి కెటిఆర్ హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… భద్రాచల ప్రజలతో మాట్లాడి వారిని సమన్వయ పరిచే ప్రయత్నం చేసారని భోగట్టా. గతంలో ఏదైతే కెసిఆర్ వారికి హామీలు ఇచ్చారో వాటిని త్వరలోనే తీరుస్తామని, ఆ పనిమీదే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కెటిఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారు కెసిఆర్ పైన పెట్టిన కేసుని తిరిగి వాపసు తీసుకోమని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.