కూతురికోసం ఏకంగా ఓ అందమైన భవంతిని నిర్మించిన రామ్ చరణ్-ఉపాసన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన పెళ్లయిన 11 ఏళ్ళ తరువాత తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలికిన సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు మెగా అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. మెగా ప్రిన్సెస్ కి నామకరణం రోజున లలితా సహస్ర నామం నుంచి ‘క్లిం కార’ అనే బీజాక్షరాలను తీసుకొని పేరు పెట్టడం జరిగింది. మరి మెగా అండ్ కామినేని వారి వారసురాలు అంటే ఒక రేంజ్ ఉంటుంది కదా. తాజాగా రామ్ చరణ్ – ఉపాసన తన బేబీ కోసం ఏకంగా ఒక ప్రత్యేక డిజైనర్ ని పెట్టి ఒక విలాసవంతమైన రూమ్ ని డిజైన్ చేసారు. ముద్దుల వారసురాలు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఉపాసన పుట్టిల్లు అయిన కామినేని నివాసంలోనే ఈ ప్రత్యేక ఇంటీరియర్‌ తో ఒక రూమ్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఇక దీనికోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ‘పవిత్రా రాజారామ్‌’ని రంగంలోకి దింపిన ఉపాసన రాంచరణ్ తమ ఇష్టాలకి తగ్గట్టు దానిని డిజైన్ చేయించడం జరిగింది. ఈ రూమ్ ని డిజైన్ చేయడానికి అమ్రాబాద్‌ ఫారెస్ట్‌ అండ్ వేదిక్‌ హీలింగ్‌ అంశాలను స్ఫూర్తిగా తీసుకున్నట్టు మనకు సోషల్ మీడియాలో వారు అధికారికంగా పోస్ట్ చేసిన వీడియోని చూస్తేనే అర్ధం అయిపోతుంది. కేవలం ఈ రూమ్ ని మాత్రమే కాదు, అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ రూమ్‌ని కూడా ఇలాగే డిజైన్ చేసారని వినికిడి. ఈ విషయాలన్నిటిని ఒక వీడియో ద్వారా ఉపాసన తెలియజేస్తూ నెట్టింట ఓ వీడియోని పోస్ట్ చేయడంతో అది కాస్త ఇపుడు వైరల్ అవుతుంది.

దాంతో ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ మరియు మెగాభిమానులు మెగా ప్రిన్సెస్ అంటే ఏమాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మెగా ప్రిన్సెస్ తో మొన్నటి వరకు హ్యాపీగా టైం స్పెండ్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ లో బిజిబిజీ అయిపోయాడు. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో షూటింగులో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మొదటిసారి తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. ప్రస్తుత షెడ్యూల్ నేపథ్యంలో రామ్ చరణ్ పై ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు అందరూ వేచి చూస్తుండడం గమనార్హం.

ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా షురూ చేయనున్నారు. ఆమధ్య ఈ సినిమానుండి విడుదల ఐనటువంటి ఫస్ట్ లుక్ కి ఎలాంటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసినదే. అంతేకాకుండా దర్శకుడు శంకర్ – రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ నుండి కొన్నాళ్ల క్రితం లీకైన ఫోటోలు టాలీవుడ్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేశాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు శంకర్ ఒకవైపు ఈ సినిమాను, మరోవైపు కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్ 2’ను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఓ రెండు మూడు వారాల గ్యాప్ తో రిలీజు కాబోతున్నాయి.