కళకి ‘కులం’ అవసరంలేదు అని నిరూపించిన కళాకారులు వీరే!

సాధారణంగా ఇండియాలోని ఏ చిత్ర పరిశ్రమలో అయినా ఎక్కువగా అగ్రకులాలదే ఆధిపత్యం అని అనుకుంటూ వుంటారు. అయితే ఎవరికీ తెలియని నిజం ఏమిటంటే సౌత్ చిత్ర పరిశ్రమలో అనేకమంది కులంతో పాటు సంబంధం లేకుండా ఎదిగిన దాఖలాలు లేకపోలేదు. వారు పుట్టి పెరిగింది దళిత సామాజిక వర్గంలోనైనా కళ ఎవడబ్బసొత్తు కాదని, తమ తమ టాలెంటుతో వున్నత శిఖరాలను అధిరోహించిన మంది చాలామంది వున్నారు. అందులో మొదటివాడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ‘ఇళయరాజా.’ అవును, ఇళయరాజా అంటే తెలియనివారు ఇక్కడ దాదాపుగా వుండరు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన లేనిదే ఇండియన్ సంగీతాన్ని మనం ఊహించుకోవడం కష్టం. అలాంటి ఆయన ఓ ఎస్సి కులానికి చెందినవారని మీలో ఎంతమందికి తెలుసు?

ఆ తరువాత చెప్పుకోదగ్గ పేరు ‘శివమణి.’ ప్రపంచ ప్రఖ్యాత గాంచిన డ్రమ్మర్ శివమణి అంటే ఎవరో తెలియని వారు ఇక్కడ వుండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు వున్నారు. ఆయన కూడా నిమ్నజాతికి చెందినవాడే. అలాగని ఆయన ఏరోజు దిగులుపడుతూ కూర్చోలేదు. తనకు ఇష్టమైన రంగంలో ఆయన ఓ వున్నత శిఖరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కమెడియన్ ‘బాబు మోహన్’ గురించి ఇక్కడ ప్రస్తావించాలి. యావత్ తెలుగు ప్రజలను తనదైన కామెడీతో ఆయన అలరించారు. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఈయన సినిమాలతో పాటు రాజకీయంలో కూడా తనదైన ముద్రని వేయగలిగారు.

అదేవిధంగా ప్రముఖ తమిళ తంబీ, డాన్సర్స్ ఆరాధ్యుడు అయినటువంటి కొరియోగ్రాఫర్ ‘లారెన్స్’ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో ఇండియన్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన లారెన్స్ అంటే జనాలకు చాలా క్రేజ్. ఆయన కూడా అదే వర్గానికి చెందినవారని చాలామందికి తెలియదు. ఆయనకు కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ వుంది. అదేవిధంగా తమిళ కుర్ర హీరో జీవా కూడా అదే వర్గానికి చెందినవాడు. కాగా ఇప్పుడు తమిళంలో వున్న అగ్ర హీరోలలో ఆయన కూడా ఒకరు. ఆయన నటించిన రంగం సినిమా తెలుగునాట కోట్ల వర్షం కురిపించింది. అదేవిధంగా ఇక్కడ నటుడు భరత్ గురించి చెప్పకోవాలి. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో భరత్ ఓ సినిమాలో నటించిన విషయం విదితమే.

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ పెద్దదిగానే ఉంటుంది. అంటే మీలో చాలామంది మా కులం తక్కువనో, మతం మరేదనో ఎవరికి వారు కొన్ని సంకెళ్లను వేసుకొని తమలో టాలెంటుని అదిమిపెడుతూ వుంటారు. అది కరెక్ట్ కాదు, ఈ సువిశాల ప్రపంచంలో కళకి ‘కులం’ అవసరంలేదు. వీరిని చూసి మీరు ఇన్స్పైర్ కావాలి. వీరు మాత్రమే కాకుండా ప్రముఖ తెలుగు కమెడియన్ పిచ్చకొట్టుడు సుధాకర్, సీనియర్ హీరోయిన్ మాధవి, తమిళ సీనియర్ సంగీత దర్శకుడు దేవా, హీరోయిన్ గోపిక, హీరో జై కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారే. అయినప్పటికీ వారి వారి రంగాల్లో అద్భుతంగా రాణించారు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం!