Business Idea : రైతులు కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయాల్సిందే..?

Business Idea : పూర్వం నుంచి గ్రామాలలో రైతులు తమ పొలాలలో సాంప్రదాయబద్ధమైన పంటలు మాత్రమే పండిస్తున్నారు. ముఖ్యంగా అలాంటి వాటిలో వరి , గోధుమ, జొన్న, పత్తి, మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలను ఎక్కువగా పండిస్తున్న విషయం తెలిసిందే. కానీ వాణిజ్య పంటల సాగు చేస్తే అద్భుతమైన లాభాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వాణిజ్య పంటలలోనే ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి . అందులో మీకు నచ్చిన పంటను వేయడం కంటే ఇప్పుడు చెప్పబడిన మహోగని చెట్టు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి చెట్ల పై పెట్టుబడి పెడితే మాత్రం కచ్చితంగా కోటీశ్వరులు అవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా పెట్టుబడిగా చూస్తే భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ముఖ్యంగా ఈ చెట్లను కొండలు.. ఎప్పుడూ నీరు ఉండే ప్రాంతాలలో పెంచకూడదు. దీని వేర్లు ఎక్కువ లోతుగా వెళ్ళలేవు.. కాబట్టి పై పైనే ఉంటాయి. ఎక్కువ గాలి వీస్తే చెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాలు కాకుండా ఇంకా ఎక్కడైనా వీటిని సాగు చేయవచ్చు. ముఖ్యంగా మెట్ట, మాగాణి భూముల కంటే బీడు భూముల్లో నే బాగా పెంచవచ్చు. 40 అడుగుల నుంచి 200 అడుగుల వరకు ఈ చెట్లు పెరుగుతాయి. మన దేశంలో ఉండే భూసారం, వాతావరణాన్ని బట్టి 60 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగా పెరగవు. కాబట్టి ఈ మొక్కలను పెంచడం చాలా సులభం. ఇకపోతే ఈ మొక్కలను పెంచే నేల స్థాయి కూడా సాధారణంగా ఉండాలి. ఎక్కువ అయితే ఈ చెట్లు తట్టుకోలేవు. ఇక పీహెచ్ స్థాయి తక్కువగా కూడా ఉండకూడదు. మధ్యరకంగా స్థాయిలో ఉన్నప్పుడు ఈ చెట్లు పెంచడానికి సరైన భూమి సారం పెంచుకోవాలి. ముఖ్యం మహోగని చెట్టు అత్యంత విలువైనది. ఎందుకంటే దీని చెక్క చాలా బలంగా ఉండడం వల్ల ఇల్లు, విలువైన ఫర్నిచర్, ప్లైవుడ్ , శిల్పాల తయారీలో, అలంకరణ లో కూడా వీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు ఇతర దేశాలలో ఈ చెట్టు ఇల్లు కట్టుకోవడం మనం చూడవచ్చు. ఈ చెట్టు యొక్క కలప సుమారుగా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ను కూడా తట్టుకుంటుంది. వర్షం పడినా.. నీటిలో నానినా చెక్కుచెదరదు అని చెప్పవచ్చు.

This is Business Idea of farmers need to do if they want to be billionaires
This is Business Idea of farmers need to do if they want to be billionaires

ఏ సీజన్లో అయినా సరే దృఢంగా ఉండే ఈ చెట్టు యొక్క కలప మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఇక కేవలం వీటిని అలంకరణకు మాత్రమే కాకుండా ఈ చెట్టు ఆకులను రక్తపోటు, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. మహోగని చెట్ల యొక్క విత్తనాలు, పువ్వులు శారీరక శక్తిని పెంచే ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మహోగని ఆకులు, గింజలతో తీసిన నూనెను దోమల నివారణకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇకపోతే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.. కాబట్టి ఈ చెట్టుకు అత్యంత విలువ ఉందని చెప్పవచ్చు. మహోగని చెట్టు యొక్క విత్తనాలు కూడా చాలా ఖరీదైనవి. ఒక కిలో విత్తనాలు మార్కెట్లో సుమారుగా 1000 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒక్క మహోగని చెట్టు పూర్తి గా ఎదిగి.. కోతకు రావడానికి సుమారుగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే మరి అన్ని సంవత్సరాలు పడుతుందా అని చాలామంది నిరుత్సాహానికి గురి అవ్వచ్చు.

కానీ వారికి మాత్రం చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.ఈ పంట పండాలి ఈ మొక్కలు కూడా లాభం ఇవ్వాలి అనుకుంటే పొలం చుట్టూ గట్లపైన ఈ చెట్ల ను పెంచవచ్చు. ఇకపోతే పొలం గట్ల పైన వేస్తే పెద్దగా నీరు అవసరం ఉండదు. కాబట్టి మీరు ఈ మొక్కలు నాటి వదిలేస్తే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోయడం తప్పనిసరి.. ఒకసారి వదిలేస్తే ఆ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల కోసం పెద్దగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక ఈ పంటను పెంచుతూనే మీరు ఇతర పంటలు పండించుకోవచ్చు. బాగా ఎత్తుగా పెరిగిన మహోగని చెట్టును 30 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర 100 చెట్లు ఉండి ఒక్కో దానిని మీరు కనీసం 30,000 కి విక్రయించాలని అనుకున్నా కూడా సుమారుగా దానికి మూడు కోట్ల రూపాయల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక పెద్ద మొత్తంలో సాగు చేస్తే లాభాలు కూడా భారీగా ఉంటాయి.