Nothing Phones : నథింగ్ నుంచి మొదటి స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..?

Nothing Phones : రోజు రోజుకి ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా మొబైల్ తయారీ సంస్థలు కూడా సరి కొత్త మోడల్స్ ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. ఇకపోతే ఇప్పుడు కూడా నథింగ్ అనే మొబైల్ తయారీ సంస్థ నుంచి జూలై 12 వ తేదీన మొదటి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు తాజాగా నథింగ్ సంస్థ ప్రకటించింది. ఇక నథింగ్ మొబైల్ తయారీ సంస్థ వ్యవస్థాపకుడు కార్ల్ పీ గత కొంతకాలంగా ఫోన్ గురించి ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే ఫోన్ పేరును అధికారికంగా ప్రకటించి అందరి ఆలోచనలను తమ కంపెనీ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ మొబైల్ కంపెనీ నథింగ్ నుంచి విడుదల కానున్న మొదటి ఫోన్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం.

ఇకపోతే ఇప్పటికే నథింగ్ ఫోన్ వన్ ను మొదటిసారి తొలి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తామని తాజాగా అధికారికంగా ప్రకటించింది. లాంచ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే మరో కీలక ప్రకటన చేసి అందరికీ ఆనందాన్ని వ్యక్తం చేసింది నథింగ్ కంపెనీ. ఇకపోతే జూలై 12 వ తేదీన నథింగ్ ఫోన్ 1 ను స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు గా తాజాగా ప్రకటించారు. ఇకపోతే ఫోన్ పేరును అధికారికంగా ప్రకటించడం ఇది. ఒక ఈవెంట్ ను కూడా నిర్వహించి మరీ ఫోన్ యొక్క పేరును వెల్లడించారు. అలా ఈ కంపెనీ పై ప్రేక్షకుల్లో హైప్ పెంచి రీసెంట్ గా పేరును కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక వచ్చే నెలలో ఈ స్మార్ట్ఫోన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ వన్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ను ఉపయోగించడం జరిగింది. కార్ల్ పీ ఇదివరకే రీ ఫ్రెష్ డిజైన్ తో అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇక ఈ తరుణంలోనే ఈ ఫోన్ యొక్క నోటిఫికేషన్లు వివరాలు కూడా లీక్ అయ్యాయి.

Nothing The first smartphone in features 
Nothing The first smartphone in features

నథింగ్ ఫోన్ వన్ మొబైల్ లాంచ్ ఈవెంట్ లండన్లో జూలై 12 వ తేదీన 08:30 గంటలకు ఆరంభమవుతుంది. ఆ సమయంలోనే ఫోన్ ఫీచర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఇకపోతే ఇప్పటికే ఈ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ కానున్నట్లు తెలిసింది. జూలై 12 వ తేదీన అందరికీ అందుబాటులో వచ్చే ఈ ఫోన్ ఇకపోతే ఇప్పటివరకు లీకైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం. నథింగ్ ఫోన్ 1 ఫ్లాగ్ షిప్ మొబైల్ అని చాలా మంది చెబుతున్నారు అయితే ఈ ఫోన్ మిడ్ రేంజ్ మొబైల్ గాని ఇలా అవుతుందని సమాచారం. నథింగ్ ఫోన్ వన్ హెచ్ డి ఆర్ 10 + సపోర్టుతో..6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ తో ఈ మొబైల్ రానున్నట్లు ఇందులో…90 Hz అమోలెడ్ డిస్ప్లే , స్నాప్ డ్రాగన్ 778 G చిప్ సెట్ తో పాటు 4500 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.

ఇక స్టోరీస్ విషయానికి వస్తే 8 GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ తో ఈ మొబైల్ లో వస్తుందని తాజాగా విడుదలైన లీకులు కూడా పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 12 సిరీస్ తో నడుస్తున్నట్లు సమాచారం. ఇక ట్రాన్స్పరెంట్ డిజైన్ తో వస్తున్న ఈ ఫోన్ చాలా కొత్తగా ఆకర్షణీయంగా ఉండను ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో అలాగే 2 మెగాపిక్సెల్ సెన్సార్ తో ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సల్ షూటర్ సెల్ఫీ కెమెరా అందించవచ్చు. మార్కెట్లో దీని ధర రూ.25 వేల నుండి రూ.28 వేల వరకు ఉంటుందని సమాచారం.