Electric Bike : సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 km..!!

Electric Bike : ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా.. ఏదైనా చాలా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బైక్ ల విషయంలో కూడా యువత చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఇకపోతే టూ వీలర్స్ బైక్ విషయంలో కూడా అనేక మార్పులు తీసుకురావాలని ద్విచక్ర వాహన తయారీ సంస్థ లకి కూడా వినియోగదారులు తెలుపుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే దేశంలో ఇంధన వనరులు బాగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్ లు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఒక కంపెనీ కూడా తమ బ్రాండ్ ను మరింత పాపులర్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ బైక్ లను ప్రవేశపెడుతూ సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఒక ప్రముఖ కంపెనీ మొదటిసారి కంపెనీ బ్రాండ్ పైన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త మోడల్స్తో పాటు అదిరిపోయే ఫీచర్లతో.. వెరైటీ బైకులను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ అయిన స్విచ్ మోటోకార్ప్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంఛ్ చేసింది.

ఇకపోతే తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇలా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడం హర్షదాయకం అని వినియోగదారులు అందరూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా వీటి ధర కూడా నిర్ణయించడం జరిగింది. ఇక సామాన్యునికి కూడా అందుబాటులో ఉండే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్ విషయంలో కూడా చాలా స్మార్ట్ గా ఉండను న్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రత్యేక ఫీచర్ లతోపాటు ధర కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇక ఆస్ట్రేలియా కు చెందిన ఆస్ట్రేలియా ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ మోడల్ ను ఇండియాలో లాంఛ్ చేయడం జరిగింది. ఇక స్విచ్ సిఎస్ఆర్ 762 పేరిట ఇండియన్ మార్కెట్లోకి ఈ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేయగా ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 110 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అని కంపెనీ స్పష్టం చేసింది. ఇక దీని ధర విషయానికి వస్తే.. ఎక్స్ షోరూం ధర రూ. 1.65 లక్షలు గా నిర్ణయించారు.

the newest Electric Bike launch 110 km on a single charge
the newest Electric Bike launch 110 km on a single charge

ఇకపోతే ఎవరైతే ఇటీవల ఈ బైక్ కొనుగోలు చేస్తారో.. వారికి సుమారుగా రూ.40 వేల వరకు తగ్గింపు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ బైకు జూలై నుంచి ఆగస్టు నెల మధ్యలో విడుదల చేయాలని భావించినప్పటికీ.. జూన్ నెలలోనే లాంచ్ చేయడం విశేషం. భారతదేశంలో ఈ ప్రాజెక్టుపై కంపెనీ దాదాపుగా 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇక ఈ స్విచ్ సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పవర్ ఫుల్ డిజైన్ తో చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇక మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 110 కిలోమీటర్ల వరకు గంటకు 120 కిలోమీటర్ల టాప్ స్పీడుతో నడపవచ్చు అని కంపెనీ తెలిపింది. ఇక ఇందులో వచ్చే 3.7 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ నిరంతరం మార్చుకోవచ్చు.

ఇక ఎలక్ట్రిక్ బైక్ ల ప్రమాణాలకు తగినట్లుగా కంబైన్డ్ చార్జింగ్ సిస్టంను బ్యాటరీ చార్జర్ ఇందులో ఉపయోగించవచ్చు. ఈ బైకు డిజైన్ పవర్ఫుల్ స్పోర్ట్స్ బైక్ లా అనిపిస్తుంది. ఇక బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే శక్తివంతమైన త్రీ కిలోవాట్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ కలిగి ఉంది. 5 అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్ప్లే తో పాటు హీట్ ను తగ్గించడానికి సహాయపడే థర్మోసిఫోన్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. లగ్జరీ, దృఢత్వం, స్టైల్, సెంట్రల్ డ్రైవింగ్ సిస్టం, స్పోర్ట్స్ , రివర్స్ పార్కింగ్ , రైడింగ్ మోడ్ లు అన్ని కూడా ఈ బైక్లో ఉండడం గమనార్హం. సి ఎస్ ఆర్ 762 లాంచింగ్ పై చాలా సంతోషంగా ఉందని స్విచ్ మోటోకార్ప్ ఇండియా హెడ్ రాజకుమార్ పటేల్ ఇటీవల వెల్లడించారు . రెండు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఈ బైక్ను అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 ఎలక్ట్రిక్ బైక్ డీలర్ షిప్ షోరూమ్ లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు.