OnePlus TV 50 Y1S PRO : వన్ ప్లస్ బ్రాండెడ్ నుంచి సరికొత్త 4K స్మార్ట్ టీవీ.. ధర తక్కువే..!!

OnePlus TV 50 Y1S PRO : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినటువంటి వన్ ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ విడుదల అవుతోంది.. వన్ ప్లస్ టీవి Y -15 ప్రో సిరీస్ నుంచీ విడుదల అయిన ఈ టీవీ ఇండియాలో విడుదల కాబోతోంది. ఇది 50 అంగుళాల డిస్ప్లే తో పాటు 4k డిస్ప్లే తో కలదు. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో అతి త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సీరీస్ లో ఇప్పటి వరకు 43 అంగుళాల మోడల్ టీవీ ని మాత్రమే రెండు నెలల క్రితం విడుదల చేసింది. కానీ ఇప్పుడు సరికొత్తగా 50 ఇంచ్ డిస్ప్లే తో ఈ కొత్త స్మార్ట్ టీవీ ని విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని వన్ ప్లస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో కూడా ఈ టీవీ లభిస్తోందని తెలియజేశారు. 4k UHD డిస్ ప్లే తో పాటు HDR -10 సపోర్ట్ ఈటీవీ కి రానుంది.

ఇక ఈ స్మార్ట్ టివి యొక్క పూర్తి వివరాల కోసం అమెజాన్ లో ప్రత్యేకమైన పేజీలను ఉంచినట్లు తెలియజేశారు. ఇందులో ఈ టీవీ కి సంబంధించిన కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్స్ ను కూడా తెలియజేయడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ గురించి ఫాలో కావాలనుకునే వారికోసం నోటిఫై బటన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ టీవీ విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే మరో పది రోజుల్లో ఈ టీవీ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 50 ఇంచుల 4k అల్ట్రా హెచ్డీ డిస్ప్లేతో వన్ ప్లస్ టీవీ 10-బీట్ కలర్ లో డీప్ ఇమేజ్ క్వాలిటీ తో అత్యుత్తమంగా ఉండేందుకు గాను ఇంజన్ ను ఈ టీవీ లో ఉంచడం జరిగింది. ఇక ఇందులో MEMC,HDR -10 సపోర్టు కూడా చేస్తోంది.

The latest 4K smart TV from the OnePlus TV 50 Y1S PRO
The latest 4K smart TV from the OnePlus TV 50 Y1S PRO

One plus TV 50 Y1S PRO : స్పెసిఫికేషన్స్

ముఖ్యంగా ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ తో పాటు..24 వాట్ SOUND OUTPUT కూడా ఇచ్చే విధంగా స్పీకర్ల ను ఇందులో చేర్చడం జరిగింది. ఇక ఇందులో SMARTVALUE కంట్రోల్ అనే ఫ్యూచర్ ను కూడా ఉంచడంతో యూజర్లకు వన్ ప్లస్ వాచ్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. స్లీప్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉన్నది. దీంతో ఒకవేళ టీవీ చూస్తూ వీడియోస్ నిద్రపోతే టీవీ స్లీప్ మోడ్ లో ఆటోమేటిక్ గా వెళ్లి పోతుంది. ఈ టీవీలో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలదు. అయితే ఈ టీవీ యొక్క ఖచ్చితమైన ధ్వని మాత్రం ఇంకా తెలియజేయలేదు . అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఏప్రిల్ లో విడుదల కాబోతున్న వన్ ప్లస్ టీవీ -43 Y-1 మొబైల్ ధర రూ.28,999 ఉన్నది ఇందులో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర మాత్రం సుమారుగా రూ.35,000 ఉండే విధంగా ఉండబోతోందని సమాచారం. మొత్తానికి అయితే ఈ స్మార్ట్ టీవీ కోసం ప్రతి ఒక్కరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.