Business Idea : ఈ వ్యాపారంతో కళ్లుచెదిరే లాభాలు మీ సొంతం..!!

Business Idea : ముఖ్యంగా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రస్తుతం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్.. మీ కోసం తీసుకు రావడం జరిగింది. ఇకపోతే మీకోసం ఒక అదిరిపోయే మంచి ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్ ఐడియా తీసుకురావడం జరిగింది. ఇక ఈ బిజినెస్ తో ఇప్పటికే చాలామంది కొన్ని లక్షల రూపాయలను లాభంగా పొందుతున్నారు. ఇక మీరు కూడా ఒకవేళ నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఇక అదే ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం.. అదేనండి బూడిద తో తయారుచేయబడిన ఇటుకలను తయారు చేయడం. ప్రస్తుతం మార్కెట్లో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది ఇక రాబోయే కాలంలో కూడా ఈ ఇటుకల కు మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏ ఒక్కరు చూసినా సరే సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో ని ఎక్కువగా ఇటుకలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. పెరుగుతున్న పట్టణీకరణ యుగంలో ..బిల్డర్లు ఇప్పుడు బూడిద తో తయారుచేసిన ఇటుకలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఇటుకలలో చాలా రకాల ఇటుకలు ఉన్నప్పటికీ బూడిదతో తయారు చేసే ఇటుకలకు మంచి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఇవి దృఢంగా ఉండటమే కాకుండా ఇంటికి పటిష్టాన్ని ఇవ్వడంతో పాటు అందమైన ఆకృతిని కూడా తీసుకొస్తున్నాయి. అందుకే చాలామంది ఈ బూడిదతో తయారు చేసే ఇటుకలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ వ్యాపారం మీరు మొదలు పెట్టాలి అంటే ఇందుకోసం మీకు 100 గజాల స్థలం తో పాటు కనీసం రెండు లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాపారం వల్ల మీకు లాభాలు రావడంతో పాటు సుమారుగా నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం గా పొందవచ్చు.

Business Idea of Manual mission must be maintained
Business Idea of Manual mission must be maintained

ఇక ఈ ఇటుకలను ఎలా తయారు చేయాలి.. ఎలా బిల్డర్ కి అమ్మాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇటుకలు తయారు చేయడానికి మీకు కావలసిన పదార్థాలు సిమెంటు , బూడిద మరియు రాతి ధూళి.. ఈ మూడింటిని మిశ్రమంలా చేసి వీటి నుంచి ఇటుకలను తయారు చేస్తారు. ఇక ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ యంత్రాన్ని మీరు వంద గజాల స్థలంలో చాలా సౌకర్యవంతంగా అమర్చవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇక ఈ యంత్రాన్ని నడపడానికి కూడా కేవలం ఐదు మంది వ్యక్తులు సరిపోతారు. రోజుకు మీరు ఎంత లేదనుకున్నా సుమారుగా మూడు వేల ఇటుకలను తయారు చేయవచ్చు . ఇక పెట్టుబడి పెట్టగలిగిన సామర్థ్యం ఉంటే ఆటోమేటిక్ మిషన్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈ యంత్రం ధర మార్కెట్లో 12 లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా ఈ ఆటోమేటిక్ మిషన్ ద్వారా సుమారుగా గంటకు 1000 ఇటుకలను తయారు చేయవచ్చు.

ఈ విధంగా చూసుకుంటే మీరు ఒక నెలకు సుమారుగా నాలుగు లక్షల ఇటుకలను సులభంగా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మట్టి లేని కారణంగా ఇటుకలను తయారు చేయడం లేదు. ఇక అలాంటి రాష్ట్రాలకు హర్యానా , పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి ఇటుకలు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో బూడిద , సిమెంటు, రాళ్ల పొడి తో తయారు చేసిన ఇటుకలను మీరు తయారు చేసి ఆయా ప్రాంతాలలో విక్రయిస్తే మంచి లాభం ఉంటుంది. మీరు మాన్యువల్ మిషన్ పెట్టుకోవాలి అనుకుంటే 30 వేల వరకు ఖర్చు అవుతుంది. ఎలా చూసినా సరే నెలకు లక్ష కి పైగా ఆదాయం లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మీ ఇటుకలను ఎవరు కొనుగోలు చేస్తారు అనే సందేహం కూడా మీకు ఉండవచ్చు. కానీ బిల్డర్లతో ఒప్పందం తీసుకొని మీరు పని స్టార్ట్ చేస్తే మీ వ్యాపారానికి ఇబ్బంది ఉండదు. లేదా గవర్నమెంట్ కాంట్రాక్టర్ లతో కూడా మీరు ఒప్పందం తీసుకోవచ్చు.