Business Idea : చింత పిక్కలతో లక్షల్లో లాభం.. పైగా ప్రభుత్వ సాయం.. ఎలాగంటే..?

Business Idea : మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ.. చింత గింజలతో కాసులు రాలుతాయని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.. చింత గింజల ద్వారా పూర్వ కాలంలో ఎక్కువగా వైకుంఠపాళి, అష్టా చమ్మ, వామనగుంటలు వంటి ఆటలు ఆడడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. ఇక అంతే కాదు ఇంతకు మించి చింతగింజలు ఎందుకు పనికొస్తాయి అని కూడా వాటిని దిబ్బలో పడేస్తూ ఉండేవారు. కానీ కాకినాడ జిల్లాలో చింతగింజల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చింత గింజలను ఈ – కామర్స్ సంస్థలు అయినటువంటి అమెజాన్ , ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సైట్లలో కూడా అమ్ముతున్నారు అంటే ఇక వీటికి ఎంత డిమాండ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మన రాష్ట్రం నుంచి కొన్ని వేల టన్నుల చింతగింజలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

ఇకపోతే మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి ఈ చింత గింజలు. ఇకపోతే మీరు కూడా చింతగింజల వ్యాపారం మొదలు పెట్టాలి అంటే అందుకు మీకు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానని అంటోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు తో పాటు పలు ప్రాంతాలలో చింతగింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. ఇకపోతే చింతకాయల నుంచి వచ్చిన చింత గింజలను వేరు చేసి వాటిని శుభ్రం చేసి గింజల పైన ఉండే తోలును తొలగిస్తారు. ఇక ఆ తర్వాత ఈ గింజలను గుజరాత్, మహారాష్ట్ర , సూరత్ వంటి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చింత గింజల నుంచి తోలు తీసిన తర్వాత వాటి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల చింత గింజలు లభ్యమవుతుండగా.. వాటిలో 22 టన్నుల వరకు ప్రాసెసింగ్ చేస్తూ ఇలా పైన తోలు తీస్తున్నారు. మన రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి , విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం వంటి జిల్లాలలో కూడా చింత గింజల ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉండడం గమనార్హం..

Business Idea of Tamarind Seeds
Business Idea of Tamarind Seeds

ఇకపోతే రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 18 వేల టన్నుల చింతగింజలు ఎగుమతి అవుతున్నాయి. ఇక వీటి విలువ సుమారు రూ. 36 కోట్లకుపైగా ఉండడం గమనార్హం. ఇక చింత గింజలను కొనుగోలు చేయడం.. ఎగుమతుల ద్వారా సుమారుగా సంవత్సరానికి రూ.70 కోట్లకుపైగా లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే చింత గింజల ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు సంవత్సరమంతా పనిచేస్తున్నాయి. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి సీజనల్గా మాత్రమే లభించే చింతగింజలు కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచి ఏడాదంతా పండు నుంచి చింత గింజలను తొలగించి అందుబాటులో ఉంచుతున్నారు. ఇకపోతే తోలు తీసిన తర్వాత చింతగింజల ధర కేజీ రూ.20 కి పైగా అమ్ముడు అవుతూ ఉండడం గమనార్హం. ఇక తోలుతో ఉన్న చింత గింజలను కేజీ పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

ఇక పోతే మన రాష్ట్రంలో ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసేసి కుటుంబాలు 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారులు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు సుమారుగా 1000 కుటుంబాల వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇక ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అంటే చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు అమ్ముతారు. ఇక వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలో.. సుమారుగా 250 డిగ్రీల వేడి వద్ద బాయిలర్ లో నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నిల్వ ఉంచుతారు. ఇక ఆ తర్వాత ఇతర రాష్ట్రాల వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు ఇకపోతే హిందూపురంలో చింత గింజలతో పౌడర్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పౌడర్ ను జర్మనీ, జపాన్ ,ఇండోనేషియా ,టర్కీ, రష్యా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇకపోతే చింత గింజల నుంచి తీసిన పౌడర్ ధర సుమారుగా కేజీ రూ.400 వరకు అమ్ముడు పోతుంది.

ఇకపోతే చింత గింజల పౌడర్ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే చాలా రంగులు చిక్కగా, పటిష్ఠంగా ఉండడానికి ఆయా రంగుల తయారీ కంపెనీలు ఈ పౌడర్ ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలు మెరవడానికి , పెలుసుగా ఉండడానికి, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలు ఈ చింత గింజల పౌడర్ ను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. అంతేకాదు కొన్ని రకాల ఫార్మా కంపెనీలు కూడా ఈ పౌడర్ ను ఉపయోగిస్తున్నాయి. ఇక అంతేకాదు మస్కిటో కాయిల్స్, పాలిస్టర్ గమ్ము ప్లాస్టిక్ తయారీలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. ఇకపోతే చింతగింజలు లో ఫైబర్, ప్రోటీన్స్ ,ఎమినో యాసిడ్ ,మినరల్స్ , ఫ్యాటి యాసిడ్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమని వీటిని ఉపయోగిస్తూ ఉండటం గమనార్హం. మీరు కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెట్టాలి అనుకుంటే జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ లో ఉన్న అధికారులను సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందజేయడంతో పాటు సబ్సిడీ కూడా అందిస్తారు.