Janasena: పవన్ జాగ్రత్తపడకపోతే కష్టమేనా ?

Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందా ? అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇపుడు గనుక పవన్ జాగ్రత్తపడకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకావముంది. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతిలో పవన్ ఈమధ్య సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో వచ్చిన ఫలితం చూసినతర్వాత పవన్ షాక్ కు గురియ్యారని సమాచారం.

అసలు దీని ఫ్లాష్ బ్యాక్ ఏమిటంటే తిరుపతి నియోజకవర్గంలో పవన్ను పోటీచేయాలని తిరుపతి నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా ఒక మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని పవన్ కు పంపారు. అందులో కీలకమైన పాయింట్ ఏమిటంటే పవన్ గనుక తిరుపతిలో పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటి గ్యారెంటీగా వస్తుందని హామీఇచ్చారు. ఇప్పటివరకు పవన్ పోటీచేసే నియోజకవర్గం విషయంలో ఇప్పటికైతే ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏవో కొన్ని నియోజకవర్గాల పేర్లు వినబడుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే తిరుపతి నేతల తీర్మానం అందేసరికి ఆ తీర్మానంపై మరింత లోతుగా పరిశీలించేందుకు పవన్ సర్వే చేయించారు. ఆ సర్వేలో వచ్చిన ఫలితం ఏమిటంటే పవన్ తిరుపతిలో గెలవరట. దీనికి కారణం ఏమిటంటే లొకల్ నేతల ఓవర్ యాక్షన్ కారణంగా బలిజేతర సామాజికవర్గాలు బాగా వ్యతిరేకంగా ఉన్నాయట. జనసేన అంటే అచ్చంగా కాపుల కోసమే పెట్టిన పార్టీ అన్నట్లుగా కొందరు నేతలు బాగా ఓవరాక్షన్ చేస్తున్నారట. దీనివల్ల మిగిలిన సామాజికవర్గాలు పార్టీకి దూరమవ్వటమే కాకుండా పవన్ కు వ్యతిరేకమైపోయారట.
ఒకపుడు ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు కూడా చాలామంది నేతలు ఇలాగే ఓవరాక్షన్ చేశారు. దాని ఫలితంగానే జనాలంతా చిరంజీవిపై వ్యతిరేకత పెంచుకుని ఓట్లేయలేదు. చివరకు అత్తారిల్లు పాలకొల్లులోనే చిరంజీవి ఓడిపోయారు. ఏదో ప్రత్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి పోటీచేసిన కారణంగా తిరుపతిలో చిరంజీవి గెలిచారు. భూమనపై అప్పటికే జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ఆ ఓట్లు పడటంతో చిరంజీవి గెలిచారంతే. అప్పట్లోనే భూమన స్ధానంలో ఇంకెవరైనా పోటీచేసుంటే చిరంజీవి గెలుపు కష్టమయ్యేదే.


ఇపుడు జనసేన విషయంలో కూడా మళ్ళీ అప్పటి ప్రజారాజ్యంపార్టీ ఓవరాక్షనే రిపీటవుతోందని అర్ధమవుతోంది. ఇపుడు గనుక పవన్ జోక్యం చేసుకుని నేతలను కంట్రోల్ చేయలేకపోతే కష్టమైపోతుంది. కేవలం కాపుల కోసమే పార్టీ అన్నట్లు కాకుండా అన్నీ సామాజికవర్గాల కోసమే పార్టీ అని జనాలు నమ్మితేనే ఓట్లేస్తారు. ఇప్పటికి జనసేన అంటే ఒకటి నుండి పదో స్ధానంవరకు పవనే కనిపిస్తారు. పవన్ తర్వాత ఎవరంటే నాదెండ్ల మనోహర్ కనబడుతున్నారు. వీళ్ళద్దరి తర్వాత మళ్ళీ ప్రొజెక్టవుతున్నది సోదరుడు నాగుబాబు మాత్రమే. వీళ్ళు కాకుండా ఎక్కువమంది నేతల్లో మళ్ళీ కాపులు లేదా బలిజలే కనబడుతున్నారు. కాబట్టి పవన్ జాగ్రత్తపడకపోతే ఎన్నికల్లో గెలవటం కష్టమే.