తన డ్రైవర్ కి లక్షల విలువచేసే కానుక బహూకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో మహేష్ ముందు వరుసలో వుంటారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకొని అశేష ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఘటన ఈయనకే చెల్లింది. ఇక ప్రస్తుతం మహేష్ – నమ్రత తన ముద్దుల కూతురు సితార సాధించిన ఘనతను ఎంజాయ్ చేస్తున్నారు. సితార పాప గురించి కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న సితార అప్పుడప్పుడు తన టాలెంటుకి సంబందించిన పోస్టులను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో తన తండ్రి మహేష్ బాబుకు తీసిపోని విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తరుచుగా తాను నృత్యం చేసే వీడియోలతోపాటు అందమైన చిత్రాలను కూడా షేర్ చేస్తూ చేస్తుంటుంది. అలా ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో తనకంటూ భారీసంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమధ్య సర్కారువారి పాట సినిమా ప్రమోషన్ కోసం తీసిన పాటలో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మహేష్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారు.

ఇక తాజాగా సితార కూడా తండ్రి బాటలోనే బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి మీరు వినే వుంటారు. ప్రముఖ జ్యూవెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్ గా సితారను నియమించుకుంది. ఈ నేపథ్యంలో ఈ జ్యువెలరీ బ్రాండ్ తన ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ ను సితారతో చేయగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అతి త్వరలోనే ఈ ప్రకటన కూడా బయటకు రాబోతోంది. ఈ యాడ్ లో నటించినందుకు సితారకు పీఎంజే జ్యువెలరీస్ సంస్థ కోటిరూపాయలు పైనే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

ఇకపోతే, ఈ ఘనతని ప్రస్తుతం ఘట్టమనేని ఫామిలీ ఎంజాయ్ చేస్తోంది. ఇక మహేష్ బాబు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, అవసరమైనపుడు డబ్బుని మరొకరికి సాయం చేస్తారు కూడా. మహేష్ కొన్ని వేల గుండె ఆపరేషన్లు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తన ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు ఆయన ఎప్పుడూ అందుబాటులో వుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన కార్ డ్రైవర్ కి లక్షల విలువచేసే ఓ కానుక బహూకరించారని సోషల్ మీడియాలో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ప్రచారం పెద్దగా ఇష్టంలేని మహేష్ ఈ విషయం గుట్టుగా ఉంచారని తెలుస్తోంది. అయినా ఈ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వ్యవహారాలు దాగవు కదా! అసలే అక్కడ ఘట్టమనేని అభిమానులు… మహేష్ కి సంబంధించి ఎలాంటి రహస్యమైనా పసిగట్టేస్తారు.