ప్రభాస్ లుక్‌ను ట్రోల్ చేస్తున్న వారిపై మండిపడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు..

నాగ్ అస్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్టు K సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దీనిపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. చాలామంది ఈ లుక్ బాగోలేదని సంతృప్తి వ్యక్తం చేశారు మెటాలిక్ సూట్ లో ఉన్న ప్రభాస్‌ను చూసి ఇదేంటి ఐరన్ మ్యాన్ లుక్ లాగా ఉంది అంటూ అవహేళన చేశారు. ప్రాజెక్టుకే నుంచి వచ్చిన ఈ లుక్కు దరిద్రంగా ఉందని, అన్ ప్రొఫెషనల్ ఎడిటర్ ఎడిట్ చేసినట్టు ఉందని కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఈ ట్రోలింగ్ చూసి బాగా కోపానికి గురైనట్లు తెలిసింది. అంతే కాదు ట్రోలింగ్ చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మహేష్ బాబు మండిపడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

“ఒక పోస్టర్ చూసేసి సినిమాను జడ్జి చేసేస్తారా, ఇలాంటి సినిమా మన ఇండియాలో ఇప్పటివరకు రాలేదు. ప్రభాస్ నుంచి వస్తుంది. దీనిని ఎంకరేజ్ చేయాలి. మనం ఇలా ప్రతిదానికి వంక పెట్టుకుంటూ పోతే ఏ సినిమాను చేయలేం.” అంటూ మహేష్ బాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ లుక్ పై విమర్శలు చేస్తున్న వారిలో చాలామంది యాంటీ-ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టుకే సినిమా చాలా బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ మూవీ ఎదురు తన్నితే నిర్మాతలు దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రభాస్ రీసెంట్‌గా తీసిన ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, సాహో వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఫ్లాప్ అయితే ప్రభాస్‌ కెరీర్ చాలా కష్టాల్లో పడుతుంది. అతనితో మళ్ళీ సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు కూడా. ఈ విషయాన్ని గమనించి ప్రభాస్ తన సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అభిమానులు అతన్నించి హిట్ రావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లతో జత కట్టాలని కూడా కోరుతున్నారు. మరి ప్రభాస్ ఎంత త్వరగా హిట్ కొడతాడో చూడాలి.