నా ప్రాణాలు కాపాడిన దేవుడు మహేష్ బాబు.. ఎమోషనల్ అయిన కమెడియన్ పంచ్ ప్రసాద్..

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ అనేక అనారోగ్యాలతో చాలా రోజులుగా బాధపడుతున్నాడు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధి వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు కిడ్నీ సమస్య ఉన్నా జబర్దస్త్ షోకి వస్తూ నవ్వులు పూయించేవాడు కానీ ఇటీవల కాలంలో అతని పరిస్థితి మరింత క్షీణించిందని అంటున్నారు. అందువల్ల అతడు కంప్లీట్ గా ఇంటి దగ్గరే ఉంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడని సమాచారం. అతను ఎలాంటి షోలలో పాల్గొనక పోవడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు అతని కుటుంబాన్ని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.

సరిగ్గా ఇదే సమయంలో పంచ్‌ ప్రసాద్ పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దాంతో పంచ్ ప్రసాద్ భార్య ఆర్థిక సాయం చేయాలంటూ తెలిసిన వారిని అడగడం స్టార్ట్ చేశారట. అలా ఆమె చాలామందిని వేడుకుంటూ ఉండగా ఈ విషయం మహేష్ బాబు వద్దకు వెళ్లిందట. ఈ బాధాకరమైన సంగతి తెలుసుకొని మహేష్ చెలించిపోయాడట. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేసి పంచ్ ప్రసాద్ చికిత్స ఖర్చులన్నీ తానే భరిస్తానని మాట కూడా ఇచ్చాడట.

దాంతో ఆసుపత్రి సిబ్బంది పంచ్‌ ప్రసాద్ కి ఆపరేషన్ చేసిందని తెలుస్తోంది. ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. తాజాగా అతను మహేష్ బాబు చేసిన సహాయం గురించి కూడా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, పంచ్‌ ప్రసాద్‌ మహేష్ బాబు తనకు హెల్ప్ చేశాడని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. “నా ప్రాణాలను కాపాడిన దేవుడు మహేష్ బాబు. ఆయనకు నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటామ”ని అతను భావోద్వేగంగా మాటలు మాట్లాడినట్లు టాక్.

ఈ టాలీవుడ్ ప్రిన్స్ “మహేష్ బాబు ఫౌండేషన్” పేరిట చాలా సేవలను చేస్తున్నాడు. అనారోగ్యాలతో బాధపడుతున్న చిన్నపిల్లలకు సొంత ఖర్చులతో చికిత్స చేయిస్తున్నాడు. అతను చేసిన వేల సాయాలలో పంచ్‌ ప్రసాద్‌కి చేసిన సాయం ఒక చిన్న విషయం మాత్రమేనని చెప్పవచ్చు. అభిమానులు ఈ సంగతి తెలుసుకొని మహేష్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు.