ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ జబర్దస్త్, ఢీ వంటి టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ 2002లోనే హోలీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. కానీ ఆ తర్వాత సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2009లో కరెంట్ సినిమాలో ఒక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వరుసగా అవకాశాలను దక్కించుకుంది కానీ హీరోయిన్ రేంజ్‌కి మాత్రం ఎదగలేకపోయింది. మంచి అవకాశాలు రాక ఆమె జబర్దస్త్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అప్పుడప్పుడు వచ్చిన సినీ అవకాశాలను చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ తార పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే తల్లి మమత రష్మీకి త్వరగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోందట. ఆల్రెడీ 35 ఏళ్ల వయసు దాటిపోయిందని, ఇంకా పెళ్లి చేసుకోకపోతే బాగోదని ప్రెజర్ తెస్తుందట. దాంతో రష్మీ తల్లి కోరిక మేరకు పెళ్లికి ఒప్పుకుందని సమాచారం. తర్వాత ఓ వ్యాపారవేత్తకు ఇచ్చి పెళ్లి చేయాలని రష్మీ తల్లి నిర్ణయించిందని తెలుస్తోంది. తను ఒక ప్రముఖ బిజినెస్ మాన్ అని అంటున్నారు కానీ అతని గురించి వివరాలు ఏవీ ఇంకా బయటికి రాలేదు.
త్వరలో రష్మీ తన పెళ్లిపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భర్తను కూడా అందరికీ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది వేసవికాలంలో గోవాలో వీరి పెళ్లి జరగనుందని కూడా టాక్ నడుస్తోంది. ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఏర్పాట్లను ప్లాన్ చేయడం మొదలు పెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా సుధీర్ అభిమానులు రష్మీకి వేరే వ్యక్తితో పెళ్లవుతుందని తెలిసి తెగ ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే వీరిద్దరి జంట చాలా బాగుంటుందని, పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని వారు కామెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు అది జరగదని తెలిసి నిరాశ పడిపోతున్నారు. మరికొందరు మాత్రం మంచి మనసున్న రష్మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశిస్తున్నారు.