పేద పిల్లలకు సైకిల్స్ పంచిపెట్టిన సితార.. 11వ పుట్టినరోజు సందర్భంగా…

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అతని సతీమణి నమ్రత కలిసి జులై 20న కూతురు సితార పుట్టినరోజును చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు. ఇంట్లోనే జరిపిన ఈ బర్త్ డే పార్టీకి మిత్రులందరూ విచ్చేసి ఆశీర్వదించారు. అందంగా డెకరేట్ చేసిన ఇంటి లోపలి ఫొటోలను, కేక్ కటింగ్ పిక్స్‌ను నమ్రత సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. సితార 11వ పుట్టినరోజు వేడుకలను చాలామంది స్కూల్ పిల్లలతో కలిసి జరుపుకుంది. అంతేకాదు వారికి సైకిల్స్ ఉచితంగా అందజేసి తన సహృదయాన్ని చాటుకుంది.

వారందరి మధ్య కేక్ కట్ చేసింది. ఆ సమయంలో స్కూల్ గర్ల్స్ బర్త్డే విషెస్ తెలుపుతూ సితారను స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేశారు. జీవితంలో ముఖ్యమైన ఆ రోజును చాలా ప్రత్యేకంగా మార్చినందుకు వారికి సితార కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఆ స్కూల్ గర్ల్స్ మరెవరో కాదు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందుతున్న పేద పిల్లలు. మహేష్ బాబు స్థాపించిన ఫౌండేషన్ వైద్య సహాయంతో పాటు విద్య విషయంలో కూడా చిన్న పిల్లలకు సహాయాన్ని అందిస్తుంది.

ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో లబ్ధి పొందిన ఆ పిల్లలకు సితార కొత్త సైకిల్స్ అందించి వారిలో సంతోషాన్ని రెట్టింపు చేసింది. సితారకి 11 ఏళ్లే అయినా చాలా గొప్ప ఆలోచనతో తన బర్త్‌డేను జరుపుకుంది. లగ్జరీ హోటల్స్‌లో గ్రాండ్‌గా తానొక్కటే ఎంజాయ్ చేయడానికి బదులుగా ఇంటిదగ్గర సింపుల్‌గా పేద పిల్లలతో సంతోషాన్ని పంచుకుంటూ ఈ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుంది. అందుకే సితారని చూస్తే తమకు గర్వంగా ఉందని మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సితార ఇలాంటి మంచి పనులు చేయడమే కాకుండా నటనలోనూ తన సత్తా చూపిస్తూ అభిమానులను ఖుషి చేస్తోంది. కమర్షియల్ యాడ్స్ లో చాలా ఈజ్‌తో నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.