బిగ్‌బాస్-7 కంటెస్టెంట్‌గా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. స్టార్ మా కీలక ప్రకటన!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పటికే ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. “కుడిఎడమైతే పొరపాటు లేదు” అంటూ విడుదలైన ఈ ట్రైలర్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపింది. ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరు అడుగు పెడతారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సీజన్ 7 కంటెస్టెంట్లకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

బేబీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్య బిగ్‌బాస్ 7 సీజన్‌లో పాటిస్పేట్ చేస్తుందనేది ఆ క్రేజీ న్యూస్ సారాంశం. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బేబీ పాత్ర చేసిన వైష్ణవి చైతన్యకు చాలా గుర్తింపు వచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. చిన్న యూట్యూబర్ స్థాయి నుంచి హీరోయిన్ లెవల్ కు ఎదిగిన వైష్ణవి జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ప్రస్తుతం ఎవరి నోటా విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. అలాగే ఈ బ్యూటీ గురించి మరింత తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ఈ భామను బిగ్ బాస్ షోకి తీసుకొస్తే టిఆర్పి రేటింగ్స్‌ హై రేంజ్‌లో పెరిగిపోతాయని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే ఆమెను ఎలాగైనా బీబీ హౌజ్‌కు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మొన్నటిదాకా యూట్యూబ్ టీవీలకే పరిమితమైన బేబీ హీరోయిన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మంచి హిట్ కొట్టింది. ఆమెకు ఈ సమయంలో సినిమా అవకాశాలు క్యూ కట్టే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమయంలో ఆమె ఏ పనీ లేనట్లు బిగ్‌బాస్ షోకి వెళ్తుందా? అని ఇంకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కాగా స్టార్ మా వైష్ణవి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.