మహేష్ బాబుకు ఇన్విటేషన్ పంపించిన ట్రంప్ కుమార్తె ఇవాంక.. ఎందుకో తెలిస్తే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నుంచి సాదర ఆహ్వానం అందింది. స్వయంగా తనతో మాట్లాడడానికి అమెరికాకి రావాల్సిందిగా మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులకు ఆమె ఇన్విటేషన్ పంపింది. దీని గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట్ల మందికి ఫేవరెట్ హీరో అయిన మహేష్ బాబు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులలో కూడా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అతని ప్రతిభ, అందం ఇవాంకా ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమె అతడిని కలవాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తోందట. మహేష్ అప్పుడప్పుడు ఫారెన్ దేశాలలో వెకేషన్‌కి కూడా వెళ్తాడని ఇవాంక తెలుసుకుందట.

అలా కుటుంబంతో వాళ్లు వెళ్లడం చూసి ఆమె ముచ్చట పడిందట. అంతేకాదు వారిని ఈసారి అమెరికాకు వస్తే వారిని తన ఇంటికి పిలవాలి అనుకుంది. మరో ఆలోచన లేకుండా తాజాగా ఈ బ్యూటీ తమ ఇంటికి రావాలని ప్రిన్స్‌కి చాలా ఆప్యాయంగా ఇన్విటేషన్ పంపినట్లు తెలుస్తోంది. ఆహ్వానం గురించిన మరిన్ని వివరాలు బయటకు రాలేదు. అయితే ఇది ఇవాంకా ఏర్పాటు చేసిన వ్యక్తిగత, ప్రత్యేకమైన సమావేశం అని తెలుస్తోంది. ఆహ్వానంలో మహేష్ బాబు, అతని కుటుంబం ఇవాంకతో కలిసి కాసేపు మాట్లాడవచ్చు. ఇరువురు అనుభవాలను పంచుకోవచ్చు. సినిమా కోసమేనా లేదా వేరే ఏదైనా ప్రాజెక్టు కోసం వారు కలిసి పని చేయడానికి సిద్ధం కావచ్చు.

మహేష్ బాబుకి ఈ ఆహ్వానం వచ్చిందని తెలుసుకొని చాలామంది అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇది అతని ఎక్స్‌ట్రాడనరీ యాక్టింగ్ స్కిల్స్‌కి గ్లోబల్ లెవెల్ లో దక్కిన ప్రతిఫలం అని అంటున్నారు. కాగా ఈ తెలుగు సూపర్ స్టార్ తనకు ఇలాంటి ఇన్విటేషన్ ఒకటి వచ్చిందని ఇంకా బహిరంగంగా ప్రకటించలేదు. ఇది నిజమేనా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమై ఉండి, అతను ఆహ్వానాన్ని అంగీకరిస్తే, అది అతని కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఘట్టం అవుతుంది.