తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోతగ్గ స్టార్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట ప్రధమంగా కనిపిస్తారు. మొదట మోడలింగ్ రంగంలో ప్రొఫెషనల్ కెరీర్ మొదలు పెట్టిన నమ్రత మిస్ ఇండియాగా మెరిసిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ తరువాత వరుస హిందీ సినిమాలతో బాలీవుడ్లో పాగా వేసిన అమ్మడు 2000లో మహేష్ బాబు నటించిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మహేష్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ సినిమా పూర్తి అయిన తరువాత దాదాపు 5 ఏళ్ళ పాటు సీక్రెట్ గా డేటింగ్ చేసిన ఈ ప్రేమ జంట. 2005లో అతడు మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్ లో వివాహం చేసుకున్నారు.
నమ్రత వివాహం తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. బాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేశారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె పలు వ్యాపారాలతో పాటు కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న సంగతి విదితమే. నమ్రత సోషల్ మీడియాలో అప్పుడపుడు తనకు, తన పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. ఇకపోతే… ఈనెల 20 తేదీ సితార తన 11వ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న పిల్లల సమక్షంలో సితార తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలకు సైకిళ్ళను కానుకగా ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇలా అమ్మాయిలందరూ సైకిళ్లతో పాటు పాఠశాల ముందు నిలబడి ఉన్నటువంటి ఫోటోని తాజాగా నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. ఘట్టమనేని అభిమానులు అయితే పండగ చేసుకుంటున్న పరిస్థితి.
ఇక అసలు విషయంలోకి వెళితే, బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 7 స్టార్ట్ చేయనుంది. ఇటీవలే ఈ షోకు సంబంధించిన లోగో పోస్టర్, టీజర్ రివీల్ చేస్తూ అడియన్స్లో మరింత ఉత్సాహం నింపారు నిర్వాహకులు. మరోవైపు ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్ లిస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్న పరిస్థితి. మిగతా కంటెస్టెంట్ల సంగతి ఎలాగున్నా, ఈ సారి షోలో నమ్రత శిరోడ్కర్ పార్టిసిపేట్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. చాలామంది ఈ మాటలను సమర్ధించినా ఘట్టమనేని అభిమానులు మాత్రం అంత అవసరం మా వదినకు పట్టలేదంటూ కౌంటర్లు వేస్తున్నారు.