Cash: ఈటీవీ లో ప్రసారమయ్యే షోలలో క్యాష్ ప్రోగ్రాం కూడా ఒకటి.. ఈ షోలో సుమ యంకరింగ్.. ఈ షోకి వచ్చే గెస్ట్ లు ఒక ఎత్తైతే.. ఈ షోలో లాస్ట్ రౌండ్ పకడో పకడో రౌండ్ మరో ఎత్తు.. ఈ రౌండ్ లో విన్నర్ అయితే వారికి ఫైనల్ అమౌంట్ తో పాటు ఆ వస్తువులను కూడా ఇచ్చేస్తారు.. ఒకవేళ కంటెస్టెంట్ ఆన్సర్ చేయలేకపోతే ఆ వస్తువులన్నీ కింద పడిపోతూ ఉంటాయి.. చాలా మందికి ఈ విషయం లో డౌట్ వుంది. ఈ వస్తువులను నిజం గానే పడేస్తారా? లేదా అని.. ఇప్పుడు ఆ డౌట్ ని ఇప్ప్పుడు మనం క్లియర్ చేసేసుకుందాం.
పకడో పకడో రౌండ్ లో వస్తువులన్నీ మూవ్ అవుతూ ఉంటాయి కదా. అవి అన్ని కిందపడేస్తారు. ప్రతి సారీ అంతంత డబ్బు పెట్టి కొని ఎలా పడేస్తారనీ మనలో చాలా మంది అనిపిస్తుంది. కానీ వాటిని నిజం గానే పడేస్తారు. అవి లోకల్ ప్రొడక్ట్స్. మనకి చూపించిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పడేసిన వాటిల్లో ఉండకపోవచ్చు. షో టైం లో తక్కువ హైట్ నుంచి పడేసి.. ఆ తరువాత లోకల్ ప్రొడక్ట్స్ ను తక్కువ కాస్ట్ లో దొరికే వాటిని పై నుంచి పడేస్తూ షూట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే.. అలా చేయడం వల్ల టిఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి. వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్లకి లక్షల్లో లాభాలు వస్తుంటే వందల్లో ఖర్చు చేయడానికి వెనుకాడారు కదా.. ఇది కూడా అంతే.