Chiranjeevi : మాటిమాటికీ తనని టార్గెట్ చేస్తున్న చిరంజీవి గురించి మొట్టమొదటిసారి స్పందించిన కొరటాల శివ ? 

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ గురించి.. అలాగే కొరటాల శివ తో వివాదం ఉన్నట్లు వచ్చిన ప్రచారం గురించి కూడా క్లారిటీ ఇచ్చే విధంగా మాట్లాడారని చెప్పొచ్చు..

Chiranjeevi koratala contravercy intresting news viral
Chiranjeevi koratala contravercy intresting news viral

గత ఏడాది భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ కొరటాల శివ నిర్ణయం ప్రకారమే సినిమా చేశాం అన్నట్లుగా చిరంజీవి స్పందించి ఆ నింద మొత్తం కొరటాల శివ మీదే వేసేశారు. దీంతో కొరటాల శివకి మెగాస్టార్ కి మధ్య ఏదో వివాదం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.

 

నేను కేవలం కొరటాల శివని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి దర్శకుల పని విధానాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడను. అనవసరంగా కొరటాల శివకి నాకు మధ్య గొడవలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ మెగాస్టార్ ఆ విషయాన్ని సమసిపోయే విధంగా మాట్లాడారు..

ఇక సినిమా స్క్రిప్ట్ బడ్జెట్ అన్ని ముందు ప్లాన్ చేసుకొని సినిమా మొదలు పెట్టాలి సినిమా బడ్జెట్ అనేది దర్శకుడు చేతుల్లోనే ఉంటుందని చిరంజీవి అన్నారు. డైరెక్టర్ అనే వాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కాబట్టి నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను అంటూ చిరంజీవి ఆ విషయంపై అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చే విధంగా మాట్లాడారు.

అయితే చిరంజీవి మాట్లాడిన మాటలకు కొరటాల శివ తన సన్నిహితుల దగ్గర మాత్రం ఒకే ఒక్క మాట చెప్పారుగా నేను మాటలతో చిరంజీవికి సమాధానం చెప్పాలనుకోవడం లేదని.. కేవలం మరో సినిమా తీసి హిట్ కొట్టి నా సత్తా ఏంటో చూపిస్తానని.. జూనియర్ ఎన్టీఆర్ తో నేను చేస్తున్నా సినిమా చూసి.. ఆ సినిమా సక్సెస్ మీట్ లో మళ్లీ మాట్లాడతాను అనేటట్లుగా కొరటాల శివ అన్నారట..