Marriage : అబ్బాయిలూ ఇది అస్సలు చదవకండి .. అమ్మాయిలు లేటుగా పెళ్లి చేసుకుంటే ఇంత బంపర్ ఆఫరా !

Marriage : పెళ్లి అనేది ఒక బంధం.. ఒక బాధ్యత.. దానిని చక్కగా నిర్వర్తించాలి అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలనీ అనేది నయా ట్రెండ్..  20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న కాలం కెరీర్ పరంగా ఎంతో ముఖ్యమైనది. ఆ సమయంలో ఇతర వ్యాపకాలతో కాలయాపన చేయకుండా.. కెరీర్ పై దృష్టి పెట్టి మంచి భవిష్యత్ కు బాట వేసుకోవాలి. అదే ఈ వయసులో పెళ్లి చేసుకుంటే బాధ్యతల వలన కెరీర్ పై దృష్టి పెట్టలేరు. ఇక 30 ఏళ్ళు వచ్చే సరికి ఒక మనిషి పూర్తిగా పరిణతి చెందుతాడు. మంచి చెడు లను అంచనా వేయడంలోను, అవతలి వ్యక్తిని అర్ధం చేసుకోవడంలోనూ జ్ఞానం సంపాదిస్తాడు. ఇది భార్య భర్తల బంధం అన్నోన్యంగా ఉండేలా చేస్తుంది..

Advertisement
These are advantages of late marriage
These are advantages of late marriage

అందుకే ఈ వయసులో పెళ్లి ఎటువంటి అనర్ధాలకు తావివ్వదు. ఉద్యోగంలో అప్పటికే నిలదొక్కుకుని ఉంటాడు కాబట్టి మరొక వ్యక్తి బాధ్యతని తీసుకోవడానికి కూడా అతనికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఉద్యోగం చేయడం వలన వచ్చే ఆత్మవిశ్వాసం పెళ్లి అయ్యిన తరువాత జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఈ వయసులో ఎక్కువగా డబ్బుని దుబారా చేయరు. జీవితంపై పరిపూర్ణ అవగాహనతోనే గడుపుతారు. అలాగే.. తమకంటే చిన్న వయసులో.. లేదా ముందే పెళ్లి అయిపోయిన వారిని చూసి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు కు అన్ని విధాలా శ్రేయస్కరం.

Advertisement
Advertisement