Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ అభిమానులకి పూన‌కాలు తెప్పించే న్యూస్.. ఇక ర‌చ్చ చేసేందుకు సిద్దం కండి..!

Sudigali Sudheer : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన క‌మెడీయ‌న్ సుడిగాలి సుధీర్. ఆయ‌న‌కు తెలుగు రాష్ట్రాల‌లో హీరోల‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర‌పై సంద‌డి చేస్తూనే సుధీర్ పలు చిత్రాల్లో కమెడియన్, సహయ నటుడిగా క‌నిపించి సంద‌డి చేశాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవ‌డంతో, ఇప్పుడు గాలోడు సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించి అల‌రించ‌నున్నాడు సుధీర్.

sudigali-sudheer-fans-full-happy
sudigali-sudheer-fans-full-happy

Sudigali Sudheer : సుధీర్ ఫ్యాన్స్ హ్యాపీ…

అయితే జ‌బ‌ర్ధ‌స్త్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన‌ సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు కూడా మెల్ల‌గా దూరమయ్యాడు. అనుహ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రత్యేక్షం కావ‌డం, ఆయ‌న‌కి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌ర‌గ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సుధీర్ జబర్దస్త్ షోకు తిరిగి వస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ ఎంత‌గానో ఆశపడుతున్నారు. అంతే కాదు కొన్ని సందర్భాల్లో కామెంట్ల రూపంలో అతినికి ఈ విషయాన్ని కూడా క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో సుధీర్ జ‌బ‌ర్ధ‌స్త్ గురించి స్పందించాడు.

తాను జబర్దస్త్ షోలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్ర‌క‌టించాడు.. కొన్ని పరిస్థితుల కారణంగా.. జబర్థస్త్ షోకి తాను బ్రేక్ ఇచ్చాను తప్పించి.. షో నుంచి శాశ్వతంగా నిష్క్రమించలేదంటూ అస‌లు విష‌యం చెప్పాడు సుధీర్. జబర్దస్త్ షోను నేను విడిచి పోలేదు. . ఒక 6 నెలలు బ్రేక్ తీసుకున్నా. ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా చెప్ప‌గా, వారు కూడా ఓకే అన్నారు. అతి త్వరలోనే మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. అంటూ సుధీర్ గుడ్ న్యూస్ చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.