Daily Astrology : నేటి రాశి ఫలాలు.. ఈ రోజుల వారికి ప్రమోషన్స్ గ్యారెంటీ..! 

Daily Astrology : మేషం:
ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఇప్పుడు మెరుగవుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

Today Horoscope October 27 2022 Check Your Zodiac Signs
Today Horoscope October 27 2022 Check Your Zodiac Signs

వృషభం:
నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు అనుకూలించవు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సంబంధిత వ్యాపారాలు చికాకు కలిగిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు.

మిధునం:
సంఘంలోని ప్రముఖులతో చర్చలకు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థిక పురోగతి కూడా కలుగుతుంది

కర్కాటకం:
ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి .గృహమున సంతాన శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి.

సింహం:
వృత్తి , వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉద్యోగమును స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది . కొన్ని ఆహ్వానాలు మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తాయి.

కన్య:
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు తప్పవు.. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

తుల:
రుణ సమస్యల నుండి ఊరట కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సంతాన వివాహ విషయాలలో శుభకార్యాలు అందుకుంటారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలపై విజయం సాధిస్తారు.

వృశ్చికం:
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది.

ధనస్సు:
వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు భావించినా కూడా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు . ప్రయాణాలలో నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని అందిస్తాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు కూడా అందుతాయి.

మకరం:
వాహన ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

కుంభం:
సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార ప్రారంభానికి ఇదే సరైన సమయం. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.

మీనం:
వాహన క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మిత్రులు సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు.