Big Boss 6 Telugu : రేవంత్‌కి లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన నాగార్జున‌.. ఈ సారి త‌ప్పు చేస్తే డైరెక్ట్‌గా బ‌య‌ట‌కు పంప‌డం ఖాయం..!

Big Boss 6 Telugu :బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్ర‌స్తుతం తెలుగులో సీజ‌న్ 6 న‌డుస్తుండ‌గా, 60 రోజులు పూర్తైంది. ఈ సారి సీజన్లోకి అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, కీర్తి బట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్, మెరీనా, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి రావు, సింగర్ రేవంత్ వంటి వారు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంద‌రు ఊహించ‌ని విధంగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ రోజు గీతూ ఎలిమినేట్ అవుతుంద‌ని చెప్పుకొస్తున్నారు.

nagarjuna-fire-on-revanth
nagarjuna-fire-on-revanth

Big Boss 6 Telugu : లాస్ట్ వార్నింగ్..

అయితే షోలో రేవంత్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అవుతుంది. ఉన్మాదిలా ఆడుతున్నావు అని హెచ్చ‌రిస్తున్నా కూడా ఆయ‌న త‌న పంథా మార్చుకోవ‌డం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు అనేది చూడ‌కుండా దాడులు చేస్తున్నాడు. ఈ విష‌యంలో నాగార్జున మ‌రోసారి క్లాస్ పీకాడు. మిషన్ పాజిబుల్’ టాస్కులో భాగంగా టీ షర్ట్ మీదున్న లైఫ్ స్ట్రిప్స్ ని తొలగించే క్రమం లో ఇనయ ని ఉద్దేశపూర్వకంగా కొట్టాడు రేవంత్ ..దీనిపై నాగార్జున తీవ్రంగా స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. ఇనాయ ని రేవంత్ కొట్టిన వీడియో నాగార్జున చూపిస్తూ ‘ఈ పని చేసినందుకు గాను నీకు యెల్లో కార్డు ఇస్తున్నాను..ఈసారి నా చేత రెడ్ కార్డు ఇచ్చేలా చేసుకోకు’ అని గ‌ట్టిగా మంద‌లించాడు.

ఇక రెడ్ కార్డ్ ఇస్తే డైరెక్ట్‌గా ఎలిమినేట్ అవ్వ‌డ‌మే మ‌రి. బిగ్ బాస్ ఇంట్లో ఒరిజినల్ క్యారెక్టర్‌తో రేవంత్ గేమ్ ఆడుతున్నాడు. కాని అతనిది ఇలాంటి మైండ్ సెట్టా అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒకటే దూకుడు, మాటలు తూలడం, వెక్కిరించడం, కోపాలు, తాపాలు.. ఇలా రేవంత్ తన స్థాయి రోజురోజుకి దిగజార్చుకుంటున్నాడు. ఇండియన్ ఐడాల్ విన్నర్, అద్భతమైన పాటలు పాడిన వ్యక్తి.. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అయిన రేవంత్.. నిజంగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి త‌న స్థాయిని దిగ‌జార్చుకున్నాడ‌నే చెప్పాలి.