Hair Tips : జుట్టు పెరగడానికి, చుండ్రు తగ్గడానికి ఇదొక్కటి చాలు.!

Hair Tips : గ్లిజరిన్ ను బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో విరివిగా వాడుతూ ఉంటారు. షాంపూలు, హెయిర్ కండిషనర్, బాడీ లోషన్, సబ్బులులో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది స్కాల్ప్ కు తేమను ఎక్కువగా అందింస్తుంది. జుట్టు పొడిబారకుండా, రాలిపోకుండా, చిట్లిపోకుండా సహాయపడుతుంది. అటువంటి గ్లిజరిన్ ను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు చూద్దాం..

Glycerine helps hair growth and stop dandruff
Glycerine helps hair growth and stop dandruff

గ్లిజరిన్ హెయిర్ మాస్క్..

గ్లిజరిన్ హెయిర్ మాస్క్ కి రెండు చెంచాలు ఆముదం, రెండు చెంచాలు కొబ్బరి నూనె, ఒక చెంచా గ్లిజరిన్, ఒక చెంచా తేనే, ఒక కోడిగుడ్డు అవసరం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆముదం, కొబ్బరినూనె, గ్లిజరిన్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డులోని తెల్లసొన కూడా వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి 20 నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. డామేజ్ అయినా హెయిర్ కి ఈ హెయిర్ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా చిట్లిపోకుండా చేస్తుంది. అలాగే చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

అలోవెరా జెల్, గ్లిజరిన్ సమన మోతాదు లో తీసుకొని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇది మీ అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. గ్లిజరిన్ ను మీరు ఉపయోగించే అన్ని రకాల హెయిర్ కండిషనర్లలో ఒక వంతు చొప్పున కలిపి వాడుకుంటే.. మీ జుట్టుని మృదువుగా, మెరిసేలాగా చేయడంతో పాటు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.