Start investing : రూ. 100 తో ఇన్వెస్ట్మెంట్ మొదలు.. రూ.16 లక్షల మీ సొంతం..!!

Start investing : రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి పొందాలనుకున్న వారికి ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.. అలాంటి వాటిలో పోస్ట్ ఆఫీస్ స్కీం కూడా ఒకటి అని చెప్పవచ్చు..పోస్ట్ ఆఫీస్ లో పలు రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్న మొత్తం నుంచి పొదుపు పథకాల లో డబ్బులు పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి వారు అనుకున్నదానికంటే ఎక్కువ రాబడిని సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే స్కీమును బట్టి వచ్చే బెనిఫిట్స్ కూడా మారుతూ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాలలో రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి.

ఈ స్కీమ్ లో చేరిన తర్వాత ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చెల్లించుకుంటూ వెళ్లాలి.. అలా నిర్ణీతకాలం వరకు పొదుపు చేసిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో ఒకే సారి భారీ మొత్తంలో మనం ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బును పొందవచ్చు.. ముందుగా మనం వంద రూపాయల తో పోస్ట్ ఆఫీస్ RD సేవలను ప్రారంభించవచ్చు.. దీనికి గరిష్ట పరిమితి అనేది ఏమీ లేదు.. ఎంత మొత్తాన్ని అయినా ప్రతి నెల డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత రాబడి కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇలా దీనిని మీరు 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది.

Start investing with Rs. 100 Rs 16 lakh is yours
Start investing with Rs. 100 Rs 16 lakh is yours

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.. ఈ వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటుంది… అందువల్ల ఈ స్కీమ్లో వడ్డీ రేట్లలో మార్పు కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ స్కీం లో 10 వేల రూపాయలను నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.16.28 లక్షలు వస్తాయట. ఇది పది సంవత్సరాల పాటు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఇతర ఛార్జీలు పెనాల్టీ కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. సరిగ్గా ప్రతి నెల డబ్బులు కట్టకపోయినా పెనాల్టీ ఛార్జీలు పడుతూ ఉంటాయి.