Hair Tips : సాధారణంగా వయసు పైబడిన వారిలో జుట్టు నెరవడం అనే సమస్య సర్వ సాధారణం.. ఈ మధ్య కాలంలో యువత, చిన్న పిల్లలలో కూడా జుట్టు నెరవడం ని మనం గమనించవచ్చు. ఇలా చిన్న వయసులోనే పిల్లలకు జుట్టు నెరవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా కొన్ని విషయాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాదు జుట్టు తెల్లబడటానికి గల కారణం కూడా ఇదే అంటూ స్పష్టం చేస్తున్నారు. ఆ కారణాలు ఏంటో మనం కూడా చదివి తెలుసుకుందాం..జుట్టు ఎందుకు తెల్లబడుతుంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం.. సైన్స్ ఫోకస్ తెలిపిన వివరాల ప్రకారం.. జుట్టు నల్లగా రావడానికి గల కారణం మెలనిన్.. ఈ మెలనిన్ అనేది జుట్టుకు రంగులు ఇచ్చే వర్ణద్రవ్యం అని చెప్పవచ్చు.
అయితే ఇదే నియమం కేవలం మనుషుల్లోనే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఎప్పుడైతే మన శరీరంలో మెలనిన్ అనే పదార్థం లోపిస్తుందో..క్రమంగా జుట్టు తెల్లబడుతుంది. 50 సంవత్సరాలు పైబడిన వారిలోనే మెలనిన్ లోపం ఉంటుంది.. అయితే ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదురవడం గమనార్హం.జుట్టు కుదుళ్లలో మెలనోసైట్స్ అనే కణాలు ఉండడం వల్ల ఇవి మెలనిన్ అనే పదార్థము ను సిద్ధం చేసి, విడుదల చేస్తాయి. ఫలితంగా జుట్టు నల్లగా కనిపిస్తుంది. మనిషికి ఒక వయసు వచ్చాక ఈ కణాల నుంచి మెలనిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గడం వల్ల ఫలితంగా జుట్టు తెల్లబడటం
అనేది మొదలవుతుంది. అయితే ప్రస్తుతం దీని ప్రభావం వృద్ధుల్లోనే కాదు, యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. శరీరంలో పోషకాల కొరత, ధూమపానం, అనారోగ్యం, ఒత్తిడి మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి.న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు.. చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేశారు. ముఖ్యంగా వీరి అధ్యయనంలో తెలిసిన విషయం ఏమిటంటే మొదటి కారణం ఒత్తిడి అని.. ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతుందని.. ఒత్తిడి నుంచి బయటకు వచ్చిన వారికి మళ్లీ జుట్టు నల్లబడుతుంది అని తెలియజేశారు శాస్త్రవేత్తలు.