Health Tips : ఎంతటి తల నొప్పి అయినా సరే ఈ ఆకుతో దూరం అవ్వాల్సిందే..!!

Health Tips : ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఏం చేయాలో తెలియక మార్కెట్లో దొరికే మందులను ఉపయోగిస్తూ పైగా సైడ్ ఎఫెక్టులు కూడా కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాటిలో తలనొప్పి కూడా ఒకటి. మరిముఖ్యంగా కొంచెం శబ్దం వచ్చినా సరే తలనొప్పితో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే వారు శబ్దాలకు దూరంగా వుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే తలనొప్పిని దూరం చేసే ఒక ఆకు గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

ఆ ఆకు ఏదో కాదు పుదీనా.. సాధారణంగా వంటలకు మంచి వాసన తీసుకురావడానికి ఈ పుదీనాను అధికంగా ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి అని మనకు తెలిసిందే. వీటి వల్ల శీతాకాలంలో వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు. పుదీనా ను ఉపయోగించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గొంతు సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ పుదీనా ఆకు వల్ల ఎంతటి తలనొప్పి అయినా సరే ఇట్టే దూరమవుతుంది. తీవ్రంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకు రసాన్ని నుదిటిపై రాయడం వల్ల కేవలం కొద్ది క్షణాల్లోనే తలనొప్పి దూరం అవుతుంది.

Headachei away from Spearmint leaf
Headachei away from Spearmint leaf

పుదీనాలో ఉండే విటమిన్ ల విషయానికి వస్తే..విటమిన్‌ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్స్‌ విటమిన్లు పుదీనాలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు దోహదపడతాయి.. మాంగనీస్‌, పొటాషియం, ఐరన్‌ వంటివి అధిక మొత్తంలో వుండడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. మెదుడు పనితీరు మెరుగై, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగు పడి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి . ఫలితంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.