#SSMB 29.. రాజమౌళి రూపొందించబోతున్న తదుపరిచిత్రం పై ఇప్పటినుంచి భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకా సినిమా మొదలే కాలేదు అప్పుడే ఊహాగానాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 మూవీ నుంచి కొన్ని రకాల వార్తలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి ఈ సినిమాను ఏకంగా ఒక్క ఇండియాలోనే కాదు చైనా, అమెరికా , రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలా దాదాపు 30 కి పైగా భాషలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
మరోవైపు ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సంస్థలతో ఆయన చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. అత్యంత గ్రాండియర్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా భాగం కానున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ వార్తలుగా మారుతున్నాయి.