Mahasena Rajesh : వివేకా కేసులో హంతకుడిని పట్టించిన మహాసేనా రాజేష్.. సీబీఐ ఈ వీడియో చూస్తే చాలు

Mahasena Rajesh : మహాసేన రాజేష్ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఏం జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు.. కాగా వైయస్ వివేకా ప్రాణాలు తీసిన కేసులో సీబీఐ ఇప్పటికే అసలు నిందితుడు ఎవరు అనేది వివరణ ఇచ్చారు.. అయితే ఈ కేసు పై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.. కాగా మహసెన రాజేష్ పలు ఆధారాలను చూపెడుతూ అసలు ఈ కుట్ర వెనుక ఉంది ఎవరో తేల్చి చెప్పేశారు..

15 మార్చ్ 2019 ఆ తరిఖు నా జగన్ మాట్లాడిన మాటలు వినిపిస్తూ.. వివేకానంద మరణించిన వెంటనే జగన్ చిన్నాన్న పోస్ట్మార్టం రిపోర్ట్ లో డెడ్లీ వెపన్ ఉందని.. చిన్ననా ని ఎవరో గొడ్డలి తో వేటు వేశారని.. ఆయన శరీరం పై 5సార్లు వేటు వేశారని.. బ్రెయిన్ కూడా బయటకు వచ్చిందని జగన్ ఆ రోజున మాట్లాడారు.. అసలు పోస్టుమార్టం రిపోర్టు రాకముందే జగనన్న చెప్పారని.. అంటే కచ్చితంగా ఆయనకు బాబాయి ప్రాణాలు తీసింది ఎవరో తెలుసా అని అన్నారు. అందుకే ముందుగా గుండెపోటు, రక్త విరోచనాలు అని చెప్పి ఆ తరువాత కథను ఈ విధంగా మలుపు తిప్పారని.. ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు రాజేష్ గుర్తు చేశారు.

అదేవిధంగా చంద్రబాబునాయుడు అప్పుడు అధికారంలో ఉన్నారు ఇదంతా నారాసుల రక్త చరిత అంటూ అప్పట్లో ప్రచారం చేశారు. కానీ వివేక చనిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారో.. ఆ మాటలను కూడా వినిపించి ..ఈ కేసును అంత తేలికగా వదిలిపెట్టనని కచ్చితంగా న్యాయం జరిగేలాగా చేస్తానని ఆయన అన్నారు . అదేవిధంగా డేడ్లీ వెపన్స్ ఉన్నాయని తెలియగానే వారి స్వరం మారిందని చంద్రబాబు మాట్లాడిన మాటలు వినిపిస్తూ ఈ వీళ్లిద్దరూ మాట్లాడిన మాటలను వింటే అసలు ఎవరు ఏం చేశారో.. మీకే ప్రత్యక్షంగా అర్థమవుతుంది అంటూ మహాసేన రాజేష్ వివేక కేసు పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రూఫ్స్ ను బయటికి తీశారు.

13 నవంబర్ 2021రోజున జగన్ మాట్లాడిన మాటలు వినిపించి గొడ్డలి మేమే కొన్నాము అన్న విధంగా చేసిన వ్యాఖ్యలు వినిపించారు. జగన్ కి గొడ్డలి కథ తెలుసని ఆయన చేయించారు అని నేను చెప్పను. కానీ ఆయనకి ఈ కథంతా తెలుసు ఒక్కసారి సిబిఐ ఈ వీడియోలను కనుక చూస్తే క్లియర్ గా వివేకా కేసు వెనకాల ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకంటే ప్రూఫ్స్ కావాలంటూ.. మహాసేన రాజేష్ డేట్ లతో సహా జగన్ మాట్లాడిన మాటలను వినిపించారు.