Health Tips : నిత్యం మన చుట్టూ ఎన్నో మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనకు తెలియదు.. కుందేటి కొమ్ము ఈ మొక్క పేరు ఎప్పుడైనా విన్నారా.. ఈ పేరు వింటంటేనే నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది కదా.. కానీ కానే కాదు.. ఆయుర్వేద వైద్యులు వాడే ఓ అరుదైన మొక్క ఇది.. ఈ మొక్క వేళ్ళు, ఆకులు, కాండం ఇందులోని ప్రతి ఒక్క భాగము కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. కుందేటి కొమ్ము శాస్త్రీయ నామం కరోలేమా అడస్కాండెన్సీస్.. కుందేటి కొమ్ము మొక్కను తెలుగులో కుందేలు పాశం, కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ము అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు.. ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కుందేటి కొమ్ము కాకరకాయ మాదిరిగా చేదుగా ఉంటుంది. కానీ అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఇందులో ఉందని పలు వైద్య గ్రంథాలలో చెప్పడం విశేషం. ఈరోజుల్లో గిరిజన వైద్యులు చాలామంది పసరు తయారీ కోసం వాడే మొక్కల్లో కుందేటి కొమ్ముకు కూడా పెద్దపీట వేస్తున్నారు. మధుమేహ నివారణకు కుందేటి కొమ్ము పనికొస్తుందని చెబుతున్నారు. ఈ చెట్టు దగ్గరకు వెళ్లేటప్పుడు మౌనంగా వెళ్లాలని.. మాట్లాడకుండా ఈ చెట్టు కొమ్మను తుంపి దానిని కనుక తింటే చేదు రుచి భావన కలగదని.. అదే మాట్లాడుకుంటూ వెళ్లి తింటే మాత్రం కాస్త చేదు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇది తినేటప్పుడు కాస్త చేదుగా.. తిన్న తర్వాత వగరుగా.. ఆ తరువాత పుల్లపుల్లగా అనిపిస్తూ ఉంటుంది..
కొన్ని వైద్య పద్ధతుల ప్రకారం కుందేటి కొమ్ము రసాన్ని టీలో కూడా కలిపి సేవించవచ్చు. అలా చేయడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణశక్తి పెరగడానికి కూడా కుందేలు కొమ్ములను మిశ్రమంగా చేసి తినవచ్చు. పొట్ట, పేగుల్లో ఏర్పడే పుండ్ల నివారణకు కూడా ఈ రసాన్ని తాగిస్తారని వైద్యులు చెబుతున్నారు. కుందేటి కొమ్ము రసాన్ని తాగితే మంచిదని పలువురు వైద్యులు చెబుతున్నారు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కుందేటి కొమ్ము ఆకులను వేడి నీటిలో మరిగించి.. ఆ కషాయాన్ని తాగితే బరువు త్వరగా తగ్గుతారు