సౌత్ వెస్ట్రన్ రైల్వే టెక్నికల్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ 2023ని ఇటీవల ప్రకటించింది. వివిధ టెక్నికల్ రోల్స్‌లో 35 ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి https://swr.indianrailways.gov.in/ ద్వారా జూలై 28, 2023 నుండి ఆగస్టు 17, 2023 వరకు సమర్పించవచ్చు.
సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023:
సంస్థ: సౌత్ వెస్ట్రన్ రైల్వే
నోటిఫికేషన్ నెం: P (CN)/SWR/03/07/2023
ఎంపిక: కాంట్రాక్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 35
పోస్టులు: సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్, జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్
పోస్టింగ్ లొకేషన్: బెంగళూరు
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: https://swr.indianrailways.gov.in/
ఖాళీల వివరాలు:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 24
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 03
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 04
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 04
మొత్తం: 35 పోస్టులు
విద్యా అర్హత:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత కోర్సులు చేసి ఉండాలి.
సీనియర్ టెక్నికల్ అసోసియేట్‌లు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఐటీ/కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, M.Sc ఎలక్ట్రానిక్స్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత కోర్సులు చదివి ఉండాలి.
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఐటీ/కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత కోర్సులు చదివి ఉండాలి.
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి కోర్సులు చదివి ఉండాలి.
వయోపరిమితి: (ఆగస్టు 17, 2023 నాటికి)
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 20 నుండి 34 సంవత్సరాలు
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 20 నుండి 34 సంవత్సరాలు
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 18 నుండి 32 సంవత్సరాలు
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 నుండి 34 సంవత్సరాల వయస్సు. సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: ‘Z’ క్లాస్ – రూ. 32000, ‘Y’ క్లాస్ – రూ. 34000, ‘X’ క్లాస్ – రూ. 37000
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: ‘Z’ క్లాస్ – రూ. 32000, ‘Y’ క్లాస్ – రూ. 34000, ‘X’ క్లాస్ – రూ. 37000
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్: ‘Z’ క్లాస్ – రూ. 25000, ‘Y’ క్లాస్ – రూ. 27000, ‘X’ క్లాస్ – రూ. 30000
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: ‘Z’ క్లాస్ – రూ. 32000, ‘Y’ క్లాస్ – రూ. 34000, ‘X’ క్లాస్ – రూ. 37000
ఎంపిక ప్రక్రియ:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్: 2019 మరియు 2023 మధ్య పొందిన GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, తర్వాత స్క్రీనింగ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్: మూడేళ్ల డిప్లొమా కోర్సులో మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, తర్వాత స్క్రీనింగ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు http://www.recruitmentscnswr.railnet.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సూచనలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: జూలై 28, 2023
దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ: ఆగస్టు 17, 2023