జూనియర్ ఎన్టీఆర్ ని చూడగానే చేతులెత్తి దండం ఏపీ మంత్రి విడదల రజిని 

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు తాజాగా చేతులెత్తి దండం పెట్టారట. ఒక ఫంక్షన్‌లో తారక్ ఎదురుపడగా వెంటనే విడదల రజిని సర్‌ప్రైజ్ అయ్యారు. అతనికి అభివాదం చేసి ఆప్యాయంగా పలకరించారు. తారక్‌ను విడదల రజిని ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్‌గా పరిగణిస్తారు. ఈ మహిళా నాయకురాలు తారక్ సినిమాలను ఎప్పుడూ చూస్తుంటారు. ముఖ్యంగా ఆమెకు యమదొంగ అంటే చాలా ఇష్టమట. అంత అభిమానం ఉంది కాబట్టే ఫంక్షన్ లో కనిపించగానే పబ్లిక్ గానే ఆమె అతడికి దండం పెడుతూ తన ఆప్యాయతను కనబరిచారు.

నిజానికి వైసీపీ పార్టీలోకి జంప్‌ చేయడానికి ముందు విడదల రజిని టీడీపీ పార్టీలో పని చేశారు ఆ సమయంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ తో కూడా కలిసి ప్రచారాలు చేసేవారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం చాలా మంచిది కాబట్టి అతనితో ఒకసారి మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. విడదల రజినీ కూడా తారక్ పర్సనాలిటీకి ఫిదా అయిపోయారు. అందుకే పార్టీ మారినా జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని ఆమె ఏమాత్రం మార్చుకోలేదు. తాజాగా అభిమానాన్ని ఆమె దాచిపెట్టలేక బయటపెట్టారు.

 

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా ప్రాజెక్ట్‌లు చూసుకుంటే ఈ హీరో ఇప్పుడు దేవర అనే యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, చైత్ర రాయ్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024, ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. NTR 31 మూవీ కూడా చేస్తున్నాడు. ఈ డార్క్ యాక్షన్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం 2023, ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

 

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న వార్ 2 అనే హిందీ స్పై థ్రిల్లర్ చిత్రంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీనితో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక సినిమా మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రంలో కూడా ఈ యంగ్ టైగర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ల గురించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.